పనసకాయ బిరియాని | Jack fruit biriyani Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Jack fruit biriyani recipe in Telugu,పనసకాయ బిరియాని, Sree Vaishnavi
పనసకాయ బిరియానిby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

పనసకాయ బిరియాని వంటకం

పనసకాయ బిరియాని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jack fruit biriyani Recipe in Telugu )

 • పనసకాయ ముక్కలు : 1 కప్పు
 • బాస్మతి రైస్ : 2 కప్పులు
 • అల్లం వెల్లుల్లిపేస్ట్ : 1 స్పూన్
 • బిరియాని ఆకులు 3
 • మరాఠి మొగ్గ : 2
 • షాజీరా : ఒక స్పూన్
 • స్టార్ : 3
 • ఇలాచీ : 4
 • చెక్క : చిన్న ముక్క
 • లవంగాలు : 4
 • ఉల్లిపాయముక్కలు : అరకప్పు
 • పచ్చిమిర్చి చీలికలు : 4
 • పుదీనా : అరకప్పు
 • కొత్తిమీర : అరకప్పు
 • కుంకుమపువ్వు : చిటికెడు
 • మిల్క్ : రెండు స్పూన్లు
 • నెయ్యి : మూడు స్పూన్లు
 • ఆయిల్ : తగినంత
 • గరం మసాలా పొడి : ఒక స్పూన్
 • కారం : ఒక స్పూన్
 • పసుపు : అరస్పూన్
 • సాల్ట్ : తగినంత
 • జీడిపప్పు : 4
 • పచ్చి కొబ్బరి ముక్క : చిన్నది
 • పెరుగు :ఒక కప్పు

పనసకాయ బిరియాని | How to make Jack fruit biriyani Recipe in Telugu

 1. ముందుగా బాస్మతి రైస్ ను కడిగి అరగంటపాటు నాననివ్వాలి .
 2. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసి మరగనివ్వాలి , మరిగాక అందులో బిరియాని ఆకూ , షాజీరా , ఇలాచీ , లవంగం , సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి అందులో ముందుగా నానపెట్టిన రైస్ వేసి 70% ఉడకనివ్వాలి.
 3. దీన్ని వడకట్టుకుని అన్నాన్ని పక్కన ఉంచుకోవాలి
 4. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో పనసకాయ ముక్కలు , పసుపు , అల్లం వెల్లుల్లిపేస్ట్ , సాల్ట్ వేసి కలుపుకి పక్కన ఉంచుకోవాలి.
 5. మిక్స్ జార్ తీసుకుని అందులో జీడిపప్పు , కొబ్బరిముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి .
 6. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి ఎక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ రంగు వచ్చేవరకు వేయించుకుని తీసుకుని పక్కనపెట్టుకోవాలి.
 7. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి ,ఆయిల్ వేసుకుని అందులో బిరియాని ఆకూ వేసి అందులో గరం మసాలాదినుసులను కొంచెం దంచుకుని వేసుకోవాలి .
 8. వేగాక అందులో, ఉల్లిపాయముక్కలు , పచ్చిమిర్చిముక్కలు , వేసి వేపుకుని ముందుగా కలిపిపెట్టుకున్న పనసకాయ ముక్కలను వేసుకుని వేయించుకోవాలి.
 9. ఇప్పుడు ఇందులో జీడిపప్పు , కొబ్బరికాయ పేస్ట్, కారం ,సాల్ట్ , వేసి మరల కాసేపు మగ్గనివ్వాలి
 10. మగ్గాక కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి కలిపి చిన్నమంటమీద 5 నిముషాలు ఉడకనివ్వాలి.
 11. ఇప్పుడు దీనిమీద ముందుగా 70% ఉడికించుకున్న రైస్ వేసి పరుచుకోవాలి
 12. దాని పైన ముందుగా వేయించుకున్న ఉల్లిపాయముక్కలు ,కొంచెం కొత్తిమీర , పుదీనా , గరం మసాలా పొడి , పాలలో కలుపుకున్న కుంకుమ పువ్వు ను వేసుకుని దీనిపైనా కొంచెం నెయ్యి వేసుకుని కుక్కర్ మూతపెట్టి ఒక పది నిముషాలు చిన్నమంట పైన దమ్ చేసుకోవాలి , కుక్కర్ విజిల్ పెట్టకూడదు.
 13. అంతే పనసకాయ దమ్ బిరియాని రెడీ

Reviews for Jack fruit biriyani Recipe in Telugu (0)