హోమ్ / వంటకాలు / కస్టర్డ్ పౌడర్ హల్వా

Photo of Custard Powder Halwa by Tejaswi Yalamanchi at BetterButter
0
0
0(0)
0

కస్టర్డ్ పౌడర్ హల్వా

Jul-04-2018
Tejaswi Yalamanchi
2 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కస్టర్డ్ పౌడర్ హల్వా రెసిపీ గురించి

ఇది చాలా తేలికగా చేసుకునే స్వీట్ ,చాలా తక్కువ నేయి తో స్వీట్ గా చేస్కోవొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1/2 కప్ : కస్టర్డ్ పౌడర్(వనిల్లా రుచి)
  2. 1 1/2 కప్ : పంచదార
  3. 3 చెంచాలు : నేయి
  4. 1 కప్ : నీరు
  5. 10 : జిడిపప్పు బద్దలు
  6. 1 చెంచా : నూనె

సూచనలు

  1. పోయి వెలిగించి దాని మీద బాగా లోతుగా ఉన్న మూకుడు పెట్టండి
  2. దానిలో కస్టర్డ్ పౌడర్, పంచదార,నీరు వేయండి.
  3. ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి
  4. హై ఫ్లేమ్ లో పెట్టుకొని 3 నిమిషాలు తిప్పుతూ ఉండండి బాగా దగ్గర పడుతుంది
  5. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోలో పెట్టుకోండి
  6. మూకుడు లోని మిశ్రమంలో ఒక చెంచా నేయి వేసి 3 నిమిషాలు తిప్పుతూ ఉండండి
  7. మూడు నిమిషాల తరువాత మళ్ళీ ఇంకొక చెంచా నేయి వేసి 3 నిమిషాలు తిప్పుతూ ఉండండి
  8. మళ్ళీ మూడు నిమిషాల తరువాత ఇంకొక చెంచా నేయి వేసి 3 నిమిషాలు తిప్పుతూ ఉండండి
  9. ఇలా తిప్పుతూ ఉండగా ఒక పాయింట్ ఆఫ్ టైం లో హల్వా గిన్నె కి అట్టుకోకుండా ఉన్నట్టు తెలుస్తోంది
  10. పక్కన పోయి మీద పాన్ పెట్టి ఒక చెంచా నూనె వేసి జీడిపప్పు వేయించండి ,హల్వా లో వేయించిన జిడిపప్పు వేసి కలుపుకోండి.
  11. ఒక ప్లేట్ కి నేయి రాసి ఈ హల్వా ని దానిలో పోసి 1 -2 గంటల వరకు ఫ్రిడ్జ్ లో పెట్టండి
  12. తరువాత తీసి ముక్కలుగా చేసుకొని ఆస్వాదించండి.
  13. కస్టర్డ్ పౌడర్ హల్వా తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర