కార్న్ ఫ్లోర్ హల్వా | Corn flour halva Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  5th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Corn flour halva recipe in Telugu,కార్న్ ఫ్లోర్ హల్వా, Indira Bhaskar
కార్న్ ఫ్లోర్ హల్వాby Indira Bhaskar
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

2

0

కార్న్ ఫ్లోర్ హల్వా వంటకం

కార్న్ ఫ్లోర్ హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Corn flour halva Recipe in Telugu )

 • కార్న్ ఫ్లోర్ఒక కప్పు
 • పంచదార ఒక కప్పు
 • నెయ్యి నాలుగు చెంచాలు
 • ఇలాచీ పొడి పావు స్పూన్
 • బాదం తురుము ఒక చెంచాడు

కార్న్ ఫ్లోర్ హల్వా | How to make Corn flour halva Recipe in Telugu

 1. ముందుగా ఒక మందపాటి మూకుడు తీసుకుని అందులో పంచదార పావు కప్పు నీరు పోసి పంచదార బాగా మరిగించాలి.
 2. ఒక గిన్నెలో రెండు కప్పుల నీరు పోసి అందులో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి.
 3. ఇప్పుడు పైన మరుగుతున్న పంచదార పాకంలో పైన చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
 4. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పొడి కొద్దిగా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేసి కలపాలి.
 5. దీనిని చిన్నమంటమీద కలుపుతూ మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి.
 6. ఇప్పుడు ఐదు నిమిషాలకి ఇది అంతా దగ్గర పడి మనం వేసిన నెయ్యి పైకి తేలుతుంది.
 7. ఇప్పుడు ఒక పళ్ళానికి నెయ్యి రాసుకుని ఈ దగ్గర పడ్డ మిశ్రమాన్ని దాంట్లో పోసుకుని పైన బాదం పప్పుతో అలంకరించి మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ చేసుకుంటే కార్న్ ఫ్లోర్ హల్వా రెడీ.

నా చిట్కా:

దీనిని కదపకుండా అలా వదిలేస్తే అది గట్టిగా ఉండలు కట్టేస్తుంది .చిన్న మంట మీద పెట్టి చేయాలి.

Reviews for Corn flour halva Recipe in Telugu (0)