గుమ్మడికాయ మాల్ పువా | Gummadikaya malpuva Recipe in Telugu

ద్వారా Lakshmi Leelavathi  |  6th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Gummadikaya malpuva recipe in Telugu,గుమ్మడికాయ మాల్ పువా, Lakshmi Leelavathi
గుమ్మడికాయ మాల్ పువాby Lakshmi Leelavathi
 • తయారీకి సమయం

  90

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  7

  జనం

3

0

గుమ్మడికాయ మాల్ పువా వంటకం

గుమ్మడికాయ మాల్ పువా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gummadikaya malpuva Recipe in Telugu )

 • 1.గుమ్మడికాయ 1/4 kg
 • 2.పంచదార 1 కప్పు.
 • 3.కోవా 250 g
 • 4.నూనె వేయించడానికి సరిపడా
 • 5.యాలుకలు 5
 • 6.జీడిపప్పు 15
 • 7.మైదా 1 కప్పు

గుమ్మడికాయ మాల్ పువా | How to make Gummadikaya malpuva Recipe in Telugu

 1. ముందుగా పూరీని తయారు చేసుకోవడానికి పదార్థాలు:;
 2. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలో మైదా ఒక కప్పు తీసుకుని అందులో 100 g కోవాను, రెండు చెంచాల పంచదార,4,యాలుకలు పొడి చేసుకుని వేసుకోవాలి ఆ పిండిని బాగా కలిపి ఉండలు లేకుండా నీటితో కలుపుకోవాలి.
 3. తర్వాత గుమ్మడికాయ ను సగం కట్ చేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
 4. ఉడికిన గుమ్మడికాయను బయటికి తీసి మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.తర్వాత ఆ పేస్ట్ ని పైన మనం కలుపుకున్న మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి.
 5. సగం గుమ్మడికాయను కూడా మెత్తగా ఉడికించుకుని,దానిని కూడా మిక్సీలో వేసుకుని పేస్ట్,లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
 6. మలై చేసుకునే విధానం:::
 7. మలై చేసుకోవడానికి ముందుగా ఒక కడై తీసుకొని అందులో మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో గుమ్మడికాయ గుజ్జుని వేసుకోవాలి.
 8. .సన్నని మంట పైన ఉడికించాలి.తర్వాత దానిలో కోవాని వేసుకుని బాగా కలపాలి.
 9. అలా ఒక పావుగంట ఆ మిశ్రమమం దగ్గర పడేదాక కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
 10. తయారైన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
 11. తర్వాత పాకం కోసం ఒక మందపాటి గిన్నెలో 1 కప్పు పంచదార తీసుకుని ఒక కప్పు నీళ్లు పోసుకుని పొయ్యిమీద పెట్టి కలుపుతూ ఉండాలి.తీగ పాకం వచ్చిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని అందులో 5 చుక్కల నిమ్మరసం పిండుకోవాలి.
 12. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో వేయించుకోవడానికి సరిపడా నూనెపోసుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిని గుండ్రటి గరిటతో కొంచెం, కొంచెం గా నూనెలో వేసుకోవాలి.పొయ్యి కింద మంట మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి.
 13. తర్వాత ఆ పూరీలను ముందుగా తయారు చేసుకున్న పాకం ఒక పళ్లెం లో పోసుకుని పళ్లెం లో ఒక్కో పూరీని ముంచి ఇంకో పళ్ళెంలో తీసుకోవాలి.
 14. తర్వాత ఆ పూరీలను పళ్ళెంలో పరచుకుని ముందుగా తయారు చేసుకున్న మలై ను మధ్యలో పెట్టుకుని గుండ్రంగా చుట్టుకోవాలి.
 15. అలా చుట్టు కున్న మలై పూరీలపై సన్నగా తరిగిన జీసిపప్పు చల్లి సర్వ్ చేయదనే

నా చిట్కా:

పూరీలను వేయించడానినికి మంట మీడియం ఫ్లేమ్ లో ఉండాలి, నూనె బాగా మరగా పెట్టకూడదు.అప్పుడే పూరీలు బాగా వస్తాయి .

Reviews for Gummadikaya malpuva Recipe in Telugu (0)