హోమ్ / వంటకాలు / మాంగో కోకనట్ జెల్లీ కేక్.

Photo of Mango coconut jelly cake. by Swapna Tirumamidi at BetterButter
107
10
0.0(0)
0

మాంగో కోకనట్ జెల్లీ కేక్.

Jul-06-2018
Swapna Tirumamidi
900 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మాంగో కోకనట్ జెల్లీ కేక్. రెసిపీ గురించి

అగర్ అగర్ వాడి చేసిన ఐటమ్.జెల్లీ టైప్ కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మాంగో మరియు కోకనట్ కలయిక కొట్టారుచులు ఇష్టపడేవారికి ఇది తప్పక నచ్చుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 10

  1. అగర్ అగర్ (చైనా గ్రాస్)....30 గ్రా"
  2. తియ్యని మామిడి పండు...పెద్ద పండు 1
  3. పంచదార 250 గ్రా..
  4. కొబ్బరి పాల పొడి ( కోకనట్ మిల్క్ పౌడర్)...75 గ్రా..
  5. చిక్కని పాలు...ఒక గరిటెడు..
  6. ఫ్రెష్ ఆరంజ్ జ్యూస్ 100 ml.
  7. మామిడి పండు ముక్కలు చిన్నగా కట్ చేసినవి....ఒక కప్పుడు.

సూచనలు

  1. అగర్ అగర్ ని రెండు భాగాలుగా అంటే 20 గ్రాములు. 10 గ్రాములు ఉండేలా చేసి విడి విడి గా చేసి ,నీరు పోసి 15 నిమిషాలు నాన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు మామిడి పండుని చెక్కు తీసి ముక్కలుగా చేసి, కొన్ని ముక్కలు చిన్నవిగా కట్ చేసి విడిగా పెట్టుకుని... మిగిలిన ముక్కలు అన్ని మిక్సీలో జార్ లో వేసి, ఆరంజ్ జ్యూస్,కొంచం నీరు కూడావేసి మెత్తగా చేసుకోవాలి.
  3. ఇప్పుడు కొబ్బరిపాల పొడిని చిన్న గిన్నీలోకి వేసి, గారిటపాలు వేసి చెంచాతో ఉండలు లేకుండా పేస్ట్ లా చేసుకోవాలి అవసరం ఐతే కొడిగా నీరు కూడా వేసుకోవచ్చు.
  4. ఇప్పుడు ఒక మందపాటిది ,కాస్త పెద్ద గిన్ని లో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో నానపెట్టిన 20 గ్రా...అగర్ అగర్ వేసి మీడియం మంట మీద ఉంచి 10 నిముషాలు కలుపుతూ ఉండాలి....అగార్ అగార్ అంతా కరిపోతుంది.
  5. ఇప్పుడు మంట తగ్గించి ,150 గ్రా పంచదార వేసి కరిగిన తరువాత మాంగో జ్యూస్ అందులోవేసి మళ్ళీ 10 నిముషాలు బాగా కలపాలి. (అగార్ అగార్ ,మాంగో రెండు కలిసిపోవాలి విడిపోకూడదు..ఒకవేళ విడిపోతే మంట ఆపి , హాండ్ బ్లెండేర్ తో మిక్స్ చేయచ్చు..అప్పుడు ఒక్కనిమిషం మంట మీద ఉంచితే చాలు..వేడిగా ఉంటుంది కాబట్టి మీద తుళ్ళకుండా చూసుకోండి.)
  6. ఒక నున్నని గాజు స్క్వేర్ కేక్ ట్రే తీసుకుని అందులోకి మాంగో మిశ్రమాన్ని మెల్లిగా పోయాలి. బుడగలు లాంటివి ఉంటే టూత్ పిక్ సాయంతో తొలగించండి.
  7. ఈ మాంగో మిశ్రమం లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడిపండు ముక్కలు... మునిగేలా ఒక్కొక్కటి గా వేసి ..మూత పెట్టకుండా ఫ్రిజ్ లో పెట్టాలి...
  8. ఇప్పడు మళ్ళీ ఒక గిన్ని తీసుకుని అందులో 10 గ్రాములు నానపెట్టిన అగర్ అగర్ వేసి కప్పున్నర నీళ్లు వేసి కరిగేదాకా మరిగించి అప్పుడు , పంచదార 100గ్రా..వేసి కరిగాక, రెడీ చేసుకున్న కొబ్బరిపాల మిశ్రమం వేసి కలుపుకోవాలి..(మామిడి జ్యూస్ కానీ, కొబ్బరి పాలు కానీ వేసేటప్పుడు కానీ మంట చాలా సన్నగా పెట్టి మాత్రమే కలపాలి...లేకపోతే విరిగి పోతాయి.)
  9. ఇప్పుడు మాంగో జెల్లీ ని బయటకు తీసి,సెట్ అయ్యిందో లేదో చేతితో తాకి చూసుకుని (చేతికి అంటకుండా ఉండాలి)...అప్పుడు... ఈ కొబ్బరి పాల మిశ్రమాన్ని మెల్లగా ఆ మాంగో జెల్లీ మీద పోయాలి.....మళ్ళీ టూత్ పిక్ సాయంతో బుడగలు ఉంటే తీసేసి.... కొద్ది సేపు ఆగక ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి...
  10. రెండున్నర గంటలు పోయాక బయటకి తీసి ముక్కలుగా కట్ చేసుకుని నచ్చిన టోప్పింగ్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి...ఇంటివారి, అతిధుల మనసులు గెలుచుకోండి.
  11. మీరు పిక్ లో చూస్తున్న టాపింగ్స్ మాంగో జెల్లీతో నాకు తోచిన విధంగా చేసినవి....మీరు కావాలంటే వేరే ఏమైనా వాడుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర