బొబ్బట్లు | Bobbatlu Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  8th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Bobbatlu recipe in Telugu,బొబ్బట్లు, Indira Bhaskar
బొబ్బట్లుby Indira Bhaskar
  • తయారీకి సమయం

    3

    గంటలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

3

0

బొబ్బట్లు వంటకం

బొబ్బట్లు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bobbatlu Recipe in Telugu )

  • మైదాపిండి నెంబర్ వన్ క్వాలిటీ పావుకిలో
  • శనగపప్పు ఒక కప్పు
  • బెల్లం తురుము ఒక కప్పు
  • ఇలాచి పౌడర్ పావు టీ స్పూను
  • నూనె అరకప్పుడు
  • నెయ్యి ట 5 స్పూన్లు

బొబ్బట్లు | How to make Bobbatlu Recipe in Telugu

  1. ముందుగా మైదా పిండిని కొద్దిగా నీరు వేసి చపాతీ పిండిలా కలుపుకుని పైన నూనె 3 చెంచాల పోసి ఒక మూడు గంటలపాటు నానపెట్టాలి. కింద చూపిన విధంగా తయారవుతుంది.
  2. ఇప్పుడు శనగపప్పుని కొద్దిగా నీరు పోసి కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడకబెట్టాలి.
  3. ఇప్పుడు దీనిని ఒక మిక్సిజార్లో వేసి కొంచెం బరకగా ముద్దగా అయ్యేవరకు మిక్సీ చేయాలి.
  4. ఈ విధంగా ముద్ద తయారవుతుంది.
  5. ఇప్పుడు ఒక మూకుట్లో బెల్లం తురుము వేసి కొద్దిగా నీరు పోసి బెల్లం పాకం రానివ్వాలి.
  6. ఇప్పుడు ఈ పాకంలో ఫైన్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
  7. ఇప్పుడు అందులో ఇలాచి పౌడం కూడా వేసి కింద చూపిన విధంగా గట్టిపడేవరకు చిన్నమంటమీద కలుపుతూ ఉండాలి.
  8. ఇప్పుడు మైదా పిండి ముద్దను కొంచెం తీసుకుని మన చేతి మీద పరచుకుని కింద చూపిన విధంగా పల్చగా వత్తుకోవాలి.
  9. దీనిని ఎంత పలుచగా ఉంటే మనకి బొబ్బట్లు అంత మెత్తగా మృదువుగా వస్తాయి.
  10. ఇప్పుడు పైన చేసుకున్న పప్పు బెల్లం తురుము మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఈ పైన వత్తుకున్న చపాతి మథ్య పెట్టి గుండ్రంగా ఉండలా చెయ్యాలి.
  11. ఇప్పుడు దీనిని ఒక పల్చని కవర్ తీసుకుని దాని మీద నూనె రాసి చేసుకున్న ఉండని నెమ్మదిగా చేతితో చపాతీలా వత్తాలి.
  12. ఇప్పుడు దీనిని పెనం మీద నెయ్యి లేదా నూనె రాసి రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి.
  13. వేడి వేడి గా ఉన్నప్పుడు నేతితో వడ్డించే బొబ్బట్లు రెడీ.

నా చిట్కా:

ఇవి చేసేటప్పుడు మైదా పిండి ఎంత తక్కువ వాడి,ఎంత పలుచగా ఒత్త గలుగుతామో బొబ్బట్లు అంత మెత్తగా వస్తాయి.

Reviews for Bobbatlu Recipe in Telugu (0)