BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బెల్లం గవ్వలు

Photo of Andhra Gavvalu by Indira Bhaskar at BetterButter
0
2
0(0)
0

బెల్లం గవ్వలు

Jul-13-2018
Indira Bhaskar
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం గవ్వలు రెసిపీ గురించి

బెల్లం గవ్వలు ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రసిద్ధమైన వంటకం. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమ పిండి 200 గ్రాములు
  2. బొంబాయి రవ్వ ఒక చెంచాడు
  3. వెన్న లేదా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు
  4. బెల్లం 200 గ్రాములు
  5. నూనె డీప్ ఫ్రైకి సరిపడా
  6. తినేసోడా చిటికెడు (ఆప్షనల్)
  7. ఇలాచీ పొడి పావు టీ స్పూను (ఆప్షనల్)

సూచనలు

  1. ముందుగా ఒక బేసిన్లో గోధుమపిండి, బొంబాయి రవ్వ ,నెయ్యి వేసి బాగా కలపాలి ఇప్పుడు అందులో కొద్దిగా నీరు కలుపుతూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు దీనిని ఒక ఇరవై నిమిషాల పాటు నాననివ్వాలి.
  3. ఈలోగా ఒక మందపాటి మీట్లో బెల్లం వేసి కొద్దిగా నీరు పోసి ఒక పావుగంట పాటు మధ్యలో కలుపుతూ తీగపాకం వచ్చేలా పాకం పట్టాలి.
  4. ఇప్పుడు పైన చేసుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని గవ్వల బల్ల లేదా ఫోర్క్ లాంటి చెంచామీద తీసుకుని గవ్వల్ని కింద చూపిన విధంగా చేయ్యాలి.
  5. నేను ఫోర్క్తో చేశాను నా దగ్గర గవ్వల బల్ల లేదు.
  6. ఇప్పుడు ఒక మూకుట్లో నూనెను వేసి బాగా కాగాక పైన చేసుకున్న గవ్వల్ని వేసి చిన్న మంట మీద ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి.
  7. ఇప్పుడు ఈ గవ్వల్ని పైన సిద్ధం చేసుకున్న బెల్లం పాకంలో వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి పాకం అంతా పట్టాక వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే తీయ తీయని ఆంధ్ర బెల్లం గవ్వలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర