మిక్స్డ్ నట్స్ లడ్డు | Mixed nuts ladoo Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  14th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mixed nuts ladoo recipe in Telugu,మిక్స్డ్ నట్స్ లడ్డు, Indira Bhaskar
మిక్స్డ్ నట్స్ లడ్డుby Indira Bhaskar
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

1

0

మిక్స్డ్ నట్స్ లడ్డు వంటకం

మిక్స్డ్ నట్స్ లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed nuts ladoo Recipe in Telugu )

 • ఖర్జూరం 100 గ్రాములు
 • జీడిపప్పు ఒక చెంచాడు
 • బాదంపప్పు ఒక చెంచాడు
 • వాల్నట్స్ ఒక చెంచాడు
 • ఫ్లాక్స్ సీడ్స్ ( అవిస) రెండు చెంచాలు
 • ఇలాచి పౌడర్ పావు చెంచా
 • తేనే 1 చెంచా ఆప్షనల్

మిక్స్డ్ నట్స్ లడ్డు | How to make Mixed nuts ladoo Recipe in Telugu

 1. ముందుగా ఖర్జూరంలో గింజలు తీసేసి ముక్కల కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
 2. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీడిపప్పు ,బాదంపప్పు ,వాల్ నట్స్ , అవిస గింజలు,ఇలాచి పౌడర్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు మిక్సీ చేయ్యాలి.
 3. ఈ విధంగా ముద్దల తయారవుతుంది. ఇష్టం ఉన్నవాళ్ళు ఇందులో తేనెను కూడా కలుపుకోవచ్చు.
 4. ఇప్పుడు వీటిని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే ఎంతో బలమైన తక్షణ శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్ లడ్డు సిద్ధం. నేను నీటిపైన ఎండుకొబ్బరితో అలంకరించాను.

నా చిట్కా:

వీటిని ఇలా చేసుకుని డబ్బాలో నిల్వ ఉంచుకుని మిల్క్ షేక్ చేసుకునేటప్పుడు ఒక ఉండను వేసుకుంటే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ ‌

Reviews for Mixed nuts ladoo Recipe in Telugu (0)