హోమ్ / వంటకాలు / స్వీట్ పొటాటో మిల్క్ పౌడర్ జామున్

Photo of Sweet potato milk powder Jamun by Indira Bhaskar at BetterButter
458
0
0.0(0)
0

స్వీట్ పొటాటో మిల్క్ పౌడర్ జామున్

Jul-14-2018
Indira Bhaskar
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ పొటాటో మిల్క్ పౌడర్ జామున్ రెసిపీ గురించి

మనం బయట కొనుక్కుని చేసుకునే గులాబ్జామ్ అలాగే ఇవి కూడా చాలా మెత్తగా మృదువుగా రుచిగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. చిలకడదుంప 1
  2. మిల్క్ పౌడర్ అర కప్పు
  3. మైదా రెండు టేబుల్ స్పూన్లు
  4. పెరుగు రెండు చెంచాలు
  5. బేకింగ్ పౌడర్ పావు చెంచా
  6. ఇలాచి పౌడర్ పావు చెంచా
  7. పంచదార ఒక కప్పు
  8. నీళ్లు తగినన్ని
  9. నూనె-వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా చిలకడ దుంపలు ఉడకపెట్టి మెత్తగా ముద్దగా చేసుకోవాలి.
  2. ఇప్పుడు అందులో పాలపొడి మైదా బేకింగ్ పౌడర్ ఇలాచి పౌడర్ పెరుగు అన్నీ వేసి మెత్తగా మృదువుగా ఉండేలా కలుపుకోవాలి.
  3. అన్ని కలపాలి
  4. అసరమైతే ఇందులో కొద్దిగా నీరు పోసుకుని మెత్తటి చపాతీపిండిలా కలపాలి.
  5. దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి.
  6. ఈలోగా ఒక గిన్నెలో పంచదార వేసి చిన్న కప్పు నీళ్లు పోసి బుడగల వచ్చేవరకు ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
  7. దీనికి మాముల పాకం సరిపోతుంది తీగపాకం రానక్కరలేదు.
  8. ఇప్పుడు ఒక ముఖంలో నూనె వేసి మరిగాక పైన చేసుకున్న జామున్ ఉండల్ని వేసి చిన్న మంట మీద ఎర్రగా వేయించాలి.
  9. ఇప్పుడు వీటిని వేడివేడి పాకంలో వేసుకోవాలి.
  10. ఎంతో మెత్తగా ఉండే స్వీట్ పొటాటో మిల్క్ పౌడర్ జామున్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర