హలీం | Haleem Recipe in Telugu

ద్వారా Ruchira Hoon  |  18th Aug 2015  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Haleem recipe in Telugu,హలీం, Ruchira Hoon
హలీంby Ruchira Hoon
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  3

  గంటలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

163

0

హలీం వంటకం

హలీం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Haleem Recipe in Telugu )

 • 250 గ్రాముల ఎముకలు లేని మటన్
 • 300 గ్రాముల గోధుమ పిండి రాత్రంతా నానపెట్టి, ఉబ్బినది
 • 1 కప్పు మిశ్రమ పప్పులు- శనగ, పెసర మరియు ఎర్రకంది పప్పు (పెసర పప్పు మరియు ఎర్ర పప్పు బద్దలు)
 • 2 చెంచాల అల్లం వెల్లుల్లి ముద్ద
 • 4 పచ్చి మిర్చి తరిగి ముద్ద చేసినవి
 • 1 చెంచా కారం
 • 4 పెద్ద చెంచాల నెయ్యి
 • 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి
 • 2 పెద్ద చెంచాల గరం మసాలా
 • 1/2 చెంచా పసుపు
 • ఉప్పు తగినంత
 • అలంకరణ కోసం:
 • 1 కప్పు వేయిచిన ఉల్లిపాయలు
 • 4 నిమ్మకాయ బద్దలు
 • తురిమిన అల్లం
 • తరిగిన కొత్తిమీర
 • తరిగిన పచ్చి మిర్చి

హలీం | How to make Haleem Recipe in Telugu

 1. మటన్ ని కొంచం ఉప్పు, పచ్చిమిరపకాయలు మరియు అల్లంవెల్లుల్లి మిశ్రమంతో ఊరబెట్టండి. 1 గంట వరకు పక్కన ఉంచండి.
 2. అంతలోపు పప్పులను కూడా నానబెట్టండి.
 3. నానిన మాంసాన్ని కచ్చాపచ్చాగా పెద్ద ముక్కలుగా తరగండి.
 4. ఇప్పుడు, మటన్, పసుపు, కారం మరియు ఉప్పులతో పాటుగా నానబెట్టిన పప్పును దాని నీటితోపాటుగా ఇంకా గోధుమలు నీటితోపాటుగా వేసి కలపండి. తక్కువ మంట మీద 1 గంట పాటు వండండి.
 5. మాంసాన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించండి. తర్వాత దాన్ని చల్లపరచి ఆ మిశ్రమాన్ని రుబ్బండి.
 6. ఒక పెద్ద కడాయిని తీసుకుని దాన్లో కొంచం నెయ్యి వేసి, తరిగిన ఉల్లిముక్కలు మరియు రుబ్బిన మటన్ మిశ్రమాన్ని వేసి కలపండి.
 7. దాన్లో గరం మసాల వేసి దాన్ని ఒక 45 నిమిషాలు లేదా హలీం సువాసన వచ్చేవరకు వండండి.
 8. తరిగిన అల్లం ముక్కలు, నిమ్మ చెక్కలు, తరిగిన కొత్తిమీర మరియు తరిగిన పచ్చిమిర్చి ఇంకా వేయించిన ఉల్లిపాయలు వేసి వడ్డించండి.

నా చిట్కా:

అదనపు నెయ్యితో పైన వేయండి.

Reviews for Haleem Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo

ఇలాంటి వంటకాలు