హోమ్ / వంటకాలు / కాజు బాదుషా

Photo of Kaju badhusha by Sree Sadhu at BetterButter
88
1
0.0(0)
0

కాజు బాదుషా

Jul-18-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాజు బాదుషా రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది చాలా కొత్తగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. మైదాపిండి: అరకిలో
  2. కరిగించిన వెన్న: 150 గ్రా
  3. పెరుగు: రెండున్నర టేబుల్‌స్పూన్లు
  4. వంటసోడా: అరటీస్పూను
  5. మంచినీళ్లు: తగినన్ని
  6. ఉప్పు: చిటికెడు
  7. పాకంకోసం: పంచదార: 200గ్రా.
  8. మంచినీళ్లు: తగినన్ని
  9. యాలకులపొడి: టీస్పూను
  10. నిమ్మరసం: టీస్పూను
  11. జీడిపప్పు 3-4
  12. జీడిపప్పు పొడి 2-3 చెంచాలు
  13. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

  1. గిన్నెలో వెన్న వేసి కరిగించి, వంటసోడా, పెరుగు వేసి బాగా గిలకొట్టినట్లుగా కలపాలి. 
  2. అందులో కొంచెం జీడిపప్పు పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి
  3. ఇప్పుడు మరో వెడల్పాటి గిన్నెలో మైదాపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. 
  4. అందులోనే వెన్న మిశ్రమం వేసి బాగా కలపాలి. 
  5. తరవాత కొద్దిగా నీళ్లు చిలకరించి గట్టి పిండిలా కలిపి అరగంటసేపు పక్కన ఉంచాలి.
  6. పిండిని మృదువుగా కలుపుతూ వాటిని కోన్ ల చుట్టుకోవాలి
  7. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి.
  8. బాదుషాలు వేగే సమయంలోనే పక్కన విడిగా ఓ గిన్నెలో పంచదార, తగినన్ని నీళ్లు పోసి సన్నని తీగ పాకం రానివ్వాలి. 
  9. ఆపై స్టవ్‌ ఆఫ్‌ చేసి యాలకులపొడి, నిమ్మరసం కలపాలి. వేగిన బాదుషాలను తీసిన వెంటనే పంచదార పాకంలో వేసి సుమారు పది నిమిషాలు ఉంచి తీయాలి. 
  10. ఆరాక వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర