షాహీ తుకడ | Shahi tukada Recipe in Telugu

ద్వారా Indira Bhaskar  |  18th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Shahi tukada recipe in Telugu,షాహీ తుకడ, Indira Bhaskar
షాహీ తుకడby Indira Bhaskar
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

షాహీ తుకడ వంటకం

షాహీ తుకడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Shahi tukada Recipe in Telugu )

  • బ్రెడ్ ముక్కలు 5
  • నూనె లేదా నెయ్యి డీప్ఫ్రైకి సరిపడా
  • పంచదార : 2కప్పులు
  • పాలు : 1/2 లీటరు
  • ఇలాచి పౌడర్ : 1/4 స్పూను
  • బాదం, జీడిపప్పు పలుకులు : 2 స్పూన్లు
  • కుంకుమపువ్వు : 1/4 స్పూను

షాహీ తుకడ | How to make Shahi tukada Recipe in Telugu

  1. ముందుగా బ్రెడ్ ని మధ్యలో కట్ చేసి చిన్న ముక్కలుగా చేసి నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార వేసి ఒక 10 నిమిషాలు బుడగల వచ్చేవరకు మరిగించాలి.
  3. అప్పుడు రాబరీ కోసం పాలు తీసుకుని ఒక మందపాటి గిన్నెలో వేసి బాగా మరగనివ్వాలి.
  4. ఇప్పుడు పాలు మరుగుతుండగా ఒక కప్పు పె పంచదార వేసి కుంకుమ పువ్వు, ఇలాచి పౌడర్ కూడా వేసి పాలు అంత దగ్గర పడి సగం అయ్యే వరకు మరిగించాలి.
  5. చిన్న మంట మీద పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
  6. ఇది అంతా ఒక చక్కని మిశ్రమంలో తయారవుతుంది దీన్నే రబరీ అంటారు.
  7. ఇప్పుడు పైన వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని పాకంలో ఒకసారి ముంచి రభరి మిశ్రమం లో వేసి పైన జీడిపప్పు బాదం , పిస్తా పప్పులతో అలంకరించుకుంటే షాహీ తుకడ రెడి.

నా చిట్కా:

ఈ రబరి ని ముందుగా చేసుకుని ఫ్రిజ్లో నిల్వ ఉంచుకోవచ్చు.

Reviews for Shahi tukada Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo

ఇలాంటి వంటకాలు