బూందీ లడ్డు | Bhundhi laddu Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  20th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bhundhi laddu recipe in Telugu,బూందీ లడ్డు, Kavitha Perumareddy
బూందీ లడ్డుby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

10

0

బూందీ లడ్డు వంటకం

బూందీ లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bhundhi laddu Recipe in Telugu )

 • 1/2 కేజి : శెనెగ పిండి
 • 1/2 కేజి : చెక్కర
 • జీడిపప్పు 50 గ్రామ్స్
 • ఎండుద్రాక్ష 50 గ్రామ్స్
 • యాలకులు 10
 • 1/2 కేజీ : నెయ్యి

బూందీ లడ్డు | How to make Bhundhi laddu Recipe in Telugu

 1. ముందుగా శనగపిండి లో తగినన్ని నీళ్లుపోసి దోసెపిండి లాగా జారుడుగా కలుపుకుని పక్కనపెట్టుకోవాలి.
 2. తరువాత పోయిమీద బాండీపెట్టి నెయ్యి వేసి కాగినతరువత బూందీ గంటేలో శనగపిండి వేసి గిన్నెతో తిప్పాలి ,శనగపిండి చుక్కలు గా పడి బూందీ రెడీ అవుతుంది .ఎక్కువగా వేగనివ్వకూడదు బూందీని .ఇలా తయారు చేసుకొని పక్కనపెట్టుకోవాలి.
 3. జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
 4. ఇప్పుడు చెక్కర ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి తీగె పాకం రానివ్వాలి. ఇప్పుడు తయారు చేసుకున్న పాకంలో బూందీ ని, వేయించిన జీడిపప్పు ద్రాక్ష యాలకుల పొడి అన్ని వేసి బాగా కలిపి లడ్డులు చుట్టుకోవాలి...

నా చిట్కా:

ఈ వంటలో కృత్రిమ రంగులు ఏమి కలపకుండా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.నేను అలాగే చేస్తాను ఎప్పుడు కృత్రిమ రంగులు వాడను.

Reviews for Bhundhi laddu Recipe in Telugu (0)