చాక్లెట్ స్ప్రెడ్ స్పాంజ్ కేక్ | Choclate spread sponge cake. Recipe in Telugu

ద్వారా Lakshmi Leelavathi  |  22nd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Choclate spread sponge cake. recipe in Telugu,చాక్లెట్ స్ప్రెడ్ స్పాంజ్ కేక్, Lakshmi Leelavathi
చాక్లెట్ స్ప్రెడ్ స్పాంజ్ కేక్by Lakshmi Leelavathi
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  35

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

3

0

About Choclate spread sponge cake. Recipe in Telugu

చాక్లెట్ స్ప్రెడ్ స్పాంజ్ కేక్ వంటకం

చాక్లెట్ స్ప్రెడ్ స్పాంజ్ కేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Choclate spread sponge cake. Recipe in Telugu )

 • పంచదార 1 కప్పు,
 • మైదా 1 కప్పు
 • నెయ్యి 4 టేబుల్ స్పూన్స్
 • బేకింగ్ పొడి 1/2 చెంచా
 • సోడా ఉప్పు చిటికెడు
 • వెనిల ఎసెన్స్ 1/2టీస్పూన్
 • గుడ్లు 3
 • జీడిపప్పు
 • పిస్తా
 • చాకో స్ప్రెడ్6 స్పూన్స్

చాక్లెట్ స్ప్రెడ్ స్పాంజ్ కేక్ | How to make Choclate spread sponge cake. Recipe in Telugu

 1. ముందుగా మిక్సిజార్లో 1 కప్పు పంచదార వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
 2. దానిలో 3 గుడ్లను పగల కొట్టుకుని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
 3. అదే జార్లో 1 కప్పు మైదా కూడా వేసుకుని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి.
 4. తర్వాత దానిలో3 స్పూన్స్ ల నెయ్యివేసుకుని మిక్సీ వేసుకోవాలి.
 5. తర్వాత దానిలో 1/2 టీస్పూన్ బేకింగ్ పొడి ,చిటికెడు సోడా ఉప్పు,చిటికెడు ఉప్పు వేసుకుని మిక్సీ వేసుకోవాలి.
 6. తర్వాత దానిలో1/2 స్పూన్ వెనిల ఎసెన్స్ వేసుకుని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి.ఇప్పుడు మనకి కావలిసిన మిశ్రమం తయారు అయ్యింది.
 7. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అంతా పూసుకోవాలి. తర్వాత కాస్త మీద చల్లు కోవాలి ఎందుకు అంటే కేక్ గిన్నెకు అంటకుండా ఉంటుంది.తర్వాత అందులో ఆ కేక్ మిశ్రమాన్ని నింపుకోవాలి.
 8. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఉప్పు పోసి పరుచుకోవాలి.
 9. దాన్ని పొయ్యి మీద పెట్టి10 నిముషాలు వేడి చెయ్యాలి.దానిలో ఒక ప్లేట్ బోర్లా పెట్టుకొని దంజ్ మీద ఈ కేక్ మిశ్రమగిన్నెను ఉంచాలి.
 10. తర్వాత 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉంచుకుని తర్వాత లో ఫ్లేమ్ లో 30 నిమిషాలు ఉంచుకోవాలి.
 11. తర్వాత ఒక స్పూన్ తీసుకొని గిన్నెలో గుచ్చితే దానికి ఏమి అంటుకోదు.అప్పుడు మన కేక్ రెడీ అయ్యినట్లే.
 12. తర్వాత 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లో కి గిన్నె బోర్లించగానే కేక్ వచ్చేస్తుంది.
 13. దాని మీద చాకో స్ప్రెడ్ పూసుకుని జీడిపప్పు ,పిస్తా తో గార్నిష్ చేసుకుంటే చాకో స్ప్రెడ్ స్పాంజ్ కేక్ రెడీ అయ్యింది.
 14. చక్కగా ముక్కలు కోసుకుని తిని ఆనందించడమే.

నా చిట్కా:

మనం కేక్ లో నెయ్యికి బదులు బటర్ వాడుకోవచ్చు

Reviews for Choclate spread sponge cake. Recipe in Telugu (0)