హోమ్ / వంటకాలు / చాక్లెట్ స్ప్రెడ్ స్పాంజ్ కేక్

Photo of Choclate  spread sponge cake. by Lakshmi Leelavathi at BetterButter
866
1
0.0(0)
2

చాక్లెట్ స్ప్రెడ్ స్పాంజ్ కేక్

Jul-22-2018
Lakshmi Leelavathi
25 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చాక్లెట్ స్ప్రెడ్ స్పాంజ్ కేక్ రెసిపీ గురించి

చాలా తేలికగా ఒవేన్ లేకుండా తయారు చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • బేకింగ్

కావలసినవి సర్వింగ: 10

  1. పంచదార 1 కప్పు,
  2. మైదా 1 కప్పు
  3. నెయ్యి 4 టేబుల్ స్పూన్స్
  4. బేకింగ్ పొడి 1/2 చెంచా
  5. సోడా ఉప్పు చిటికెడు
  6. వెనిల ఎసెన్స్ 1/2టీస్పూన్
  7. గుడ్లు 3
  8. జీడిపప్పు
  9. పిస్తా
  10. చాకో స్ప్రెడ్6 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా మిక్సిజార్లో 1 కప్పు పంచదార వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
  2. దానిలో 3 గుడ్లను పగల కొట్టుకుని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
  3. అదే జార్లో 1 కప్పు మైదా కూడా వేసుకుని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి.
  4. తర్వాత దానిలో3 స్పూన్స్ ల నెయ్యివేసుకుని మిక్సీ వేసుకోవాలి.
  5. తర్వాత దానిలో 1/2 టీస్పూన్ బేకింగ్ పొడి ,చిటికెడు సోడా ఉప్పు,చిటికెడు ఉప్పు వేసుకుని మిక్సీ వేసుకోవాలి.
  6. తర్వాత దానిలో1/2 స్పూన్ వెనిల ఎసెన్స్ వేసుకుని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి.ఇప్పుడు మనకి కావలిసిన మిశ్రమం తయారు అయ్యింది.
  7. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అంతా పూసుకోవాలి. తర్వాత కాస్త మీద చల్లు కోవాలి ఎందుకు అంటే కేక్ గిన్నెకు అంటకుండా ఉంటుంది.తర్వాత అందులో ఆ కేక్ మిశ్రమాన్ని నింపుకోవాలి.
  8. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఉప్పు పోసి పరుచుకోవాలి.
  9. దాన్ని పొయ్యి మీద పెట్టి10 నిముషాలు వేడి చెయ్యాలి.దానిలో ఒక ప్లేట్ బోర్లా పెట్టుకొని దంజ్ మీద ఈ కేక్ మిశ్రమగిన్నెను ఉంచాలి.
  10. తర్వాత 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉంచుకుని తర్వాత లో ఫ్లేమ్ లో 30 నిమిషాలు ఉంచుకోవాలి.
  11. తర్వాత ఒక స్పూన్ తీసుకొని గిన్నెలో గుచ్చితే దానికి ఏమి అంటుకోదు.అప్పుడు మన కేక్ రెడీ అయ్యినట్లే.
  12. తర్వాత 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లో కి గిన్నె బోర్లించగానే కేక్ వచ్చేస్తుంది.
  13. దాని మీద చాకో స్ప్రెడ్ పూసుకుని జీడిపప్పు ,పిస్తా తో గార్నిష్ చేసుకుంటే చాకో స్ప్రెడ్ స్పాంజ్ కేక్ రెడీ అయ్యింది.
  14. చక్కగా ముక్కలు కోసుకుని తిని ఆనందించడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర