పిస్తాబర్ఫీ | Pistachio burfi Recipe in Telugu

ద్వారా Shilpa Deshmukh  |  23rd Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pistachio burfi recipe in Telugu,పిస్తాబర్ఫీ , Shilpa Deshmukh
పిస్తాబర్ఫీ by Shilpa Deshmukh
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  40

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

పిస్తాబర్ఫీ వంటకం

పిస్తాబర్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pistachio burfi Recipe in Telugu )

 • పిస్తా: 1 కప్
 • పంచదార: 1కప్
 • నీరు: ½ కప్
 • నెయ్యి: ¾ కప్
 • కోవా/mawa: ½cup
 • గ్రీన్ ఫుడ్ కలర్: కొన్ని చుక్కలు
 • ఏలకుల పొడి: చిటికెడు

పిస్తాబర్ఫీ | How to make Pistachio burfi Recipe in Telugu

 1. ముందుగా పిస్తాపప్పులను వేడినీళ్ళలో ఒక 5నిముషాలు ఉడకించాలి. స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
 2. ఇప్పుడు పిస్తాలను నీటి నుండి వేరుచేసి, ఒక ప్లేట్ కి తీసుకొని, వాటికి పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి.
 3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌమీద పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి, ఈ పిస్తాపప్పులను వేసి క్రిస్పీగా రోట్ చేసుకొని, పక్కన తీసి పెట్టి చల్లారనివ్వాలి.
 4. ఇప్పుడు చల్లారిన పిస్తాపప్పును చల్లారినిచ్చి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
 5. ఇప్పుడు ఒక డీప్ బాటమ్ పాన్లో నీళ్ళు పోసి బాగా మరిగించి అందులో పంచదార వేసి బాగా మరిగించాలి.
 6. పంచదార వేడినీటిలో కరిగి, చిక్కగా తయారయ్యే సమయంలో అందులో పిస్తాపౌడర్, గ్రీన్ ఫుడ్ కలర్ మరియు కోవా వేసి బాగా మిక్స్ చేయాలి.
 7. మీడియం మంట మీద 15-20నిముషాలు ఉడకించుకోవాలి. ఇప్పుడు నిధానంగా నెయ్యి, యాలకుల పొడి వేసి నిధానంగా కలియబెడుతూ 10నిముషాలు ఉడికించుకోవాలి.
 8. మొత్తం మిశ్రమం పాన్ కు వదలువుతున్నప్పుడు స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ప్లేట్ కు కొద్దిగా నెయ్యి రాసి ఈ మొత్తం మిశ్రమాన్ని ప్లేట్ లో పోయాలి . ఇది మొత్తం ప్లేట్ లో సర్ధాలి. చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి. అంతే పిస్తా బర్ఫీ రెడీ.

Reviews for Pistachio burfi Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo