బంగాళదుంప క్యాప్సికమ్ గ్రేవీ కూర | ALOO CAPSICUM CURRY Recipe in Telugu

ద్వారా Ram Ram  |  9th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of ALOO CAPSICUM  CURRY by Ram Ram at BetterButter
బంగాళదుంప క్యాప్సికమ్ గ్రేవీ కూరby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

27

0

బంగాళదుంప క్యాప్సికమ్ గ్రేవీ కూర వంటకం

బంగాళదుంప క్యాప్సికమ్ గ్రేవీ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ALOO CAPSICUM CURRY Recipe in Telugu )

  • క్యాప్సికమ్ 2 చిన్నవి
  • ఆలూ పెద్దది ఒకటి
  • టమాటో 1
  • ఉల్లిపాయ పెద్దది 1
  • 1స్పూన్ పల్లీలు
  • 5జీడిపప్పు గుళ్ళు
  • జీలకర్ర 1/2స్పూన్
  • గరం మసాలా 1టీ స్పూన్
  • పచ్చిమిర్చి 2
  • ఆవాలు 1/4స్పూన్
  • కరివేపాకు కొద్దిగా
  • మినపప్పు 1/2స్పూన్
  • పసుపు కొద్దిగా
  • కారం కొద్దిగా
  • ఉప్పు సరిపడా
  • కొత్తిమీర కొద్దిగా

బంగాళదుంప క్యాప్సికమ్ గ్రేవీ కూర | How to make ALOO CAPSICUM CURRY Recipe in Telugu

  1. ముందుగా అన్ని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.. ఈలోపు జీడిపప్పు గుళ్ళు 5 ,1స్పూన్ పల్లీలు,1/2స్పూన్ జీలకర్ర విడి విడి గా నూనె లేకుండా వేయించి ఈ మూడు కలిపి పొడిచేసుకోవాలి..
  2. పాన్ పెట్టి 5స్పూన్ల నూనె వేసి చిన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు,మినపప్పు 1/2స్పూన్,ఆవాలు 1/4స్పూన్ కరివేపాకు ,పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి..
  3. అన్ని వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసి మగ్గనివ్వాలి..మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి టమాటో ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి..
  4. అన్ని మగ్గిన తర్వాత కొద్దుగా నీళ్లు వేసి దగ్గర పడనిచ్చి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఇంకొన్ని నీళ్లు వేసి మళ్ళీ ఉడికించుకోవాలి..
  5. కూర దగ్గర పడే ముందు మనం ముందుగా చేసుకున్న జీడిపప్పు పల్లీలు పొడి వేసి గరం మసాలా కూడా వేసుకుని నూనె పైకి వచ్చే వరకు ఉడికించుకుని..చివరిగా కొత్తిమీర వేసుకోవాలి..
  6. అంతే క్యాప్సికమ్ ఆలూ గ్రేవీ కూర రెడి..

నా చిట్కా:

ఈ కూర అన్నం లో కంటే చాపతిలకే బాగుంటుంది..ఇదే కూర బంగాళదుంప బదులుగా క్యారెట్ కూడా వేసుకోవచ్చు

Reviews for ALOO CAPSICUM CURRY Recipe in Telugu (0)