ఊతప్పం | Ootappam Recipe in Telugu

ద్వారా మనస్విని శెట్టి  |  9th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Ootappam by మనస్విని శెట్టి at BetterButter
  • తయారీకి సమయం

    8

    గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

ఊతప్పం వంటకం

ఊతప్పం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ootappam Recipe in Telugu )

  • మినప్పప్పు ఒక కప్పు
  • ఇడ్లి రవ్వ ఒక కప్పు
  • ఉల్లిపాయ ముక్కలు అర కప్పు
  • తరిగిన పచ్చిమిర్చి పావు కప్పు
  • కొత్తిమీర తురుము పావు కప్పు
  • కారం ఒక స్పూన్
  • ఉప్పు రెండు స్పూన్లు
  • కేరట్ తురుము పావు కప్పు
  • నూనె రెండు స్పూన్లు

ఊతప్పం | How to make Ootappam Recipe in Telugu

  1. ముందుగా మినప్పప్పు తగినంత నీళ్ళు పోసి నాలుగు గంటలు నానబెట్టాలి
  2. నానిన మినప్పప్పు మెత్తగా రుబ్బుకోవాలి
  3. ఇడ్లి రవ్వ లో తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టాలి
  4. తరువాత ఇడ్లి రవ్వలో నీళ్ళు బాగా పిండాలి
  5. ఇప్పుడు ఇడ్లి రవ్వని రుబ్బి పెట్టుకున్న మినప్పప్పు పిండిలో వేసి బాగా కలుపుకోవాలి
  6. ఈ మిశ్రమాన్ని ఒక మూడు గంటలు పాటు పక్కన పెట్టుకోవాలి
  7. ఇప్పుడు ఇడ్లి పిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  8. పొయ్యి మీద పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి
  9. వేడెక్కిన తరువాత నూనె వేసి ఇడ్లి పిండి మిశ్రమం దోస లా పరుచుకోవాలి
  10. ఆ దోస మీద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కేరట్ తురుము వేయాలి
  11. ఇప్పుడు కొంచెం కారం చల్లుకోవాలి
  12. ఈ ఊతప్పాన్ని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి
  13. ఇప్పుడు ఊతప్పం సిద్ధం

నా చిట్కా:

ఈ ఊతప్పం పై ఆవకాయ నూనె వేసి కాల్చుకుంటే రుచిగా ఉంటుంది

Reviews for Ootappam Recipe in Telugu (0)