కొత్తిమీర అన్నం | CORIANDER RICE Recipe in Telugu

ద్వారా Ram Ram  |  9th Aug 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • CORIANDER RICE recipe in Telugu,కొత్తిమీర అన్నం, Ram Ram
కొత్తిమీర అన్నంby Ram Ram
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

3

1

కొత్తిమీర అన్నం వంటకం

కొత్తిమీర అన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CORIANDER RICE Recipe in Telugu )

 • కొత్తిమీర కట్ట పెద్దది 1
 • వండిన అన్నం (1గ్లాసు బియ్యం)
 • ఆవాలు 1/4స్పూన్
 • పసుపు 1/4స్పూన్
 • జీలకర్ర 1/4స్పూన్
 • మినపప్పు 1స్పూన్
 • సేనగా పప్పు 1స్పూన్
 • పల్లీలు 2స్పూన్లు
 • కరివేపాకు కొద్దిగా
 • ఎండుమిర్చి 4
 • నిమ్మకాయ 1
 • నూనె 5చెంచాలు

కొత్తిమీర అన్నం | How to make CORIANDER RICE Recipe in Telugu

 1. ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి..
 2. కొత్తిమీర కడిగి మిక్సీలో పేస్ట్ రెడి చేసి పెట్టుకోవాలి..
 3. ఇప్పుడు పాన్ పెట్టి 5 చెంచాల నూనె వేసి 1/4స్పూన్ ఆవాలు ,1/4స్పూన్ జీలకర్ర,1స్పూన్ మినపప్పు,1స్పూన్ సేనగపప్పు,2స్పూన్ల పల్లీలు,వేసి వేయించి ఎండుమిర్చి ముక్కలు,కరివేపాకు వేసి వేయించాలి..
 4. ఇప్పుడు పేస్ట్ చేసిన కోతిమీరను వేసి దగ్గర పడనివ్వాలి 1/4చెంచా పసుపు వేసి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి..
 5. ఇప్పుడు వండిన అన్నం వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి..
 6. చివరిగా నిమ్మరసం పిండుకోవాలి.. అంతే కొత్తిమీర అన్నం తయారు..

నా చిట్కా:

కొత్తిమీర బదులు పుదీనా కూడా ఇలానే చేసుకోవచ్చు..మసాలలు వేసి బిర్యానిల కూడా చేసుకోవచ్చు..

Reviews for CORIANDER RICE Recipe in Telugu (1)

Veeru Katakam7 months ago

సూపర్
జవాబు వ్రాయండి