పుదీనా పచ్చడి. | Pudina chutney Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pudina chutney recipe in Telugu,పుదీనా పచ్చడి., Ganeprameela
పుదీనా పచ్చడి.by Ganeprameela
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

పుదీనా పచ్చడి. వంటకం

పుదీనా పచ్చడి. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pudina chutney Recipe in Telugu )

 • పుదీన 5 కట్టలు
 • పచ్చిమిర్చి 7-8
 • చింత పండు 25gms
 • నూనె 50gms
 • చెనగపప్పు 2స్పూన్స్
 • మినపప్ప 2 స్పూన్స్
 • వెల్లుల్లి 1 గడ్డ
 • ఆవాలు 1 స్పూన్
 • జీలకర్ర 1 స్పూన్
 • ఎండుమిర్చి 2
 • ఇంగువ 1/4 స్పూన్
 • పసుపు 1/4 స్పూన్
 • ఉప్పు తగినంత
 • మెంతులు 1 స్పూన్
 • కర్వేపాకు 1 రెమ్మ

పుదీనా పచ్చడి. | How to make Pudina chutney Recipe in Telugu

 1. పుదీన ఆకులు శుభ్రంగా కడిగి స్టవ్ పైన పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేయించి తీయాలి
 2. అదే పాన్ లో పుదీన వేసి వేయించాలి ఈ లోపు వేరె స్టవ్ పైన పాన్ పెట్టి మెంతులు జీలకర్ర వేయంచాలి
 3. చింతపండు వేడినీళ్ళల్లో నాన పెట్టి పెట్టాలి అన్నీ చల్లార పెట్టి మిక్స్కీ జార్ లో వేసి తగినంత ఉప్పు వెల్లుల్లి రెబ్బలు 4-5 వేసి గ్రైండ్ చేసి
 4. తరువాత పోపు చేస్కోవాలి కడాయిలో నూనె వేసి ఆవాలు జీలకర్ర చెనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కర్వేపాకు వెల్లుల్లి రెబ్బలు 6-7 పసుపు ఇంగువ వేసి పోపు చేసి గ్రైండ్ చేసిన పచ్చడిలో కలిపితే పుదీనా పచ్చడి రెడీ

నా చిట్కా:

వెల్లుల్లి వంటల్లో ఎక్కువగా వాడితే గుండె జబ్బులు రావు

Reviews for Pudina chutney Recipe in Telugu (0)