హోమ్ / వంటకాలు / వంకాయ శివంగి పులుసు

Photo of Vankaya sivangi pulusu by మనస్విని శెట్టి at BetterButter
285
1
0.0(0)
0

వంకాయ శివంగి పులుసు

Aug-12-2018
మనస్విని శెట్టి
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ శివంగి పులుసు రెసిపీ గురించి

వంకాయలు తో గుత్తి వంకాయ కానీ , వంకాయ కూర కానీ ఎప్పుడూ చేసుకుంటాం కానీ ఈ వంకాయ శివంగి పులుసు చాలా పురాతన వంటకం.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • చిన్న మంట పై ఉడికించటం
 • సైడ్ డిషెస్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. వంకాయలు 1/4 కిలో
 2. చింతపండు 50 గ్రాములు
 3. జీలకర్ర 2 స్పూన్లు
 4. పల్లీలు 2 స్పూన్లు
 5. పచ్చి సేనగపప్పు 2 స్పూన్లు
 6. నువ్వులు ఒక స్పూను
 7. ఎండుమిర్చి 10
 8. మినప్పప్పు 2 స్పూన్ల్
 9. ఉప్పు 3 స్పూన్లు
 10. మెంతులు ఒక స్పూను
 11. ఇంగువ చిటికెడు
 12. కరివేపాకు ఒక రెమ్మ
 13. నూనె 5 స్పూన్లు
 14. అల్లం తురుము 1 స్పూను
 15. బెల్లము తురుము రెండు స్పూన్లు

సూచనలు

 1. ముందుగా స్టవ్ మీద కడయి పెట్టాలి
 2. కడయి లో నూనె లేకుండా పల్లీలు,సేనగపప్పు,ఒక స్పూను జీలకర్ర,ఎండుమిర్చి,మినపప్పు,ధనియాలు ,6 ఎండుమిర్చి చిన్న మంట పై దోరగా వేయించాలి
 3. ఇవి వేగి కమ్మటి వాసన వస్తుండగా ఒక పళ్లెం లో తీసుకోవాలి
 4. తరువాత అదే కడయి లో మెంతులు వేసి దోరగా వేయించాలి
 5. మెంతులు వేగిన తరువాత వేరే పళ్లెం లో తీసుకోవాలి
 6. ఇప్పుడు చింతపండు లో నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి
 7. ఇప్పుడు శుభ్రం చేసిన వంకాయలు తీసుకుని ఆ వంకాయలను గుత్తి వంకాయ కూర మాదిరిగా కోయాలి
 8. ఇప్పుడు ముందు వేయించిన పప్పులు, మెంతులు వేరువేరుగా మిక్సీ చేసి పొడి చేసుకోవాలి
 9. ఈ పప్పుల పొడిని వంకాయ లలో మధ్యలో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి
 10. ఇప్పుడు కడయి పెట్టి వేడెక్కిన తరువాత నూనె వేయాలి
 11. నూనె వేడెక్కిన తరువాత అల్లం తురుము ,పసుపు వేయాలి
 12. ఇప్పుడు స్టఫ్ చేసిన వంకాయలు వేసి కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గించాలి
 13. వంకాయలు మగ్గిన తరువాత చింతపండు పులుసు వేయాలి
 14. ఈ పులుసు మరుగుతుండగా బెల్లము,మెంతిపొడి, పప్పుల పొడి వేసి కలపాలి
 15. ఈ పులుసు బాగా మరిగించి తగినంత ఉప్పు వేసి దించేయాలి
 16. ఇప్పుడు మళ్లీ స్టవ్ మీద వేరే పాన్ పెట్టి నూనె వేయాలి
 17. నూనె వేడెక్కిన తరువాత జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి,ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి
 18. ఈ తాలింపు వేగిన తరువాత పులుసు లో వేసుకోవాలి
 19. వంకాయ శివంగి పులుసు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర