ఆకుకూర వాక్కాయ పులుసు | Leafy veg vakkaya grevy curry Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Leafy veg vakkaya grevy curry recipe in Telugu,ఆకుకూర వాక్కాయ పులుసు, Chandrika Marripudi
ఆకుకూర వాక్కాయ పులుసుby Chandrika Marripudi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

ఆకుకూర వాక్కాయ పులుసు వంటకం

ఆకుకూర వాక్కాయ పులుసు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Leafy veg vakkaya grevy curry Recipe in Telugu )

 • తోటకూర:2కట్టలు
 • పాలకూర:2కట్టలు
 • టొమాటోలు:4
 • కందిపప్పు:గుప్పెడు
 • పెసరపప్పు:గుప్పెడు
 • ఉల్లిపాయలు:2
 • పచ్చి మిర్చి:4
 • వాక్కాయలు:10
 • ఉప్పు:తగినంత
 • కారం:2స్పూన్లు
 • పసుపు:చిటికెడు
 • నూనె:2స్పూన్లు
 • ఆవాలు:1స్పూన్
 • జీలకర్ర:1స్పూన్
 • ధనియాలు:2స్పూన్లు
 • వెల్లుల్లి రెబ్బలు:6
 • కరివేపాకు:2రెమ్మలు
 • కొత్తిమీర:కొద్దిగా

ఆకుకూర వాక్కాయ పులుసు | How to make Leafy veg vakkaya grevy curry Recipe in Telugu

 1. ముందుగా ఆకుకూరలను శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకోవాలి.
 2. ఉల్లి, టొమాటో, పచ్చి మిర్చి కూడా తరిగి పెట్టుకోవాలి.
 3. కందిపప్పు, పెసరపప్పు కడిగి పెట్టుకోవాలి.
 4. పైవన్నీ కుక్కర్లో వేసి ఉప్పు, కారం‌,పసుపు, వాక్కాయలు వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టి 4,5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
 5. ప్రెషర్ పోయాక మూత తీసి కలపాలి
 6. పోపు పాన్ లో 2 స్పూన్లు నూనె వేసి వేడయ్యాక ఆవాలు,జీలకర్ర,ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు వేసి వేగాక కూరలో వేసి కలుపుకుని తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి.

Reviews for Leafy veg vakkaya grevy curry Recipe in Telugu (0)