డ్రై ఫ్రూట్ బొబ్బట్లు | Dry fruit obbatulu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Dry fruit obbatulu recipe in Telugu,డ్రై ఫ్రూట్ బొబ్బట్లు, Sree Vaishnavi
డ్రై ఫ్రూట్ బొబ్బట్లుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  38

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

డ్రై ఫ్రూట్ బొబ్బట్లు వంటకం

డ్రై ఫ్రూట్ బొబ్బట్లు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dry fruit obbatulu Recipe in Telugu )

 • 250 గ్రాములు మైదా పిండి
 • 1/8 కప్పు బొంబాయి రవ్వ
 • చిటికెడు ఉప్పు
 • 2  చెంచాలు నూనె
 • నీళ్ళు తగినంత
 • 1 కప్పు  పచ్చిశనగపప్పు
 • 200 గ్రాములు బెల్లం తురుము
 • 200 ml నీళ్లు (పాకం కోసం)
 • 15 బాదంపప్పులు
 • 15 పిస్తాపప్పులు
 • 15 జీడిపప్పులు
 • ¼ కప్పు పల్లీలు వేయించి
 • ¼ కప్పు ఎండు కొబ్బరి పొడి
 • 3-4 ఏలకులు
 • ¼ కప్పు నెయ్యి

డ్రై ఫ్రూట్ బొబ్బట్లు | How to make Dry fruit obbatulu Recipe in Telugu

 1. మైదా పిండి గిన్నెలోకి తీసుకోవాలి.
 2. అందులో చిటికెడు ఉప్పు, నూనె, కొద్దిగా బొంబాయి రవ్వ వేసి ఒకసారి కలపాలి.
 3. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ మెత్తగా చపాతి పిండిలా కలుపుకోవాలి.
 4. పైన తేమ పోకుండా కొద్దిగా నూనె రాసి మూత ఉంచి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
 5. పప్పు ని శుభ్రంగా కడిగి అంగుళం పైన వరకు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఒక మరుగు వచ్చే వరకు ఉడికించాలి.
 6. పప్పు అదే షేప్ లో ఉండాలి కానీ పూర్తిగా ఉడకాలి.మెత్తగా పేస్ట్ లా కాకుండా చూసుకోవాలి.
 7. జీడి పప్పు, బాదం పప్పు,పల్లీ మరియు పిస్తాపప్పు లను దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి కొట్టాలి.
 8. ఉడికించి పెట్టుకున్న పచ్చి సెనగ పప్పును కూడా మిక్సీలో వేసి పొడి కొట్టాలి.
 9. ఏలకులను కూడా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
 10. అన్ని పొడులను ఒకే గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి
 11. ఒక బాణలిలో బెల్లం తురుము, నీళ్ళు పోసి మరిగే వరకు ఉడికించాలి.
 12. మరగడం మొదలవగానే, పైన తయారు చెసి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి.
 13. మిశ్రమం గట్టిగా ముద్దలా అవగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
 14. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి.
 15. ఒక్కో ఉండను మైదా లేదా గోధుమ పిండి మధ్యలో ఉంచి చపాతీ లా ఒత్తుకోవాలి.
 16. పెనంలో 2 చెంచాలు ల నెయ్యి వేసి బొబ్బట్లను రెండు వైపులా సమంగా కాల్చుకోవాలి.
 17. కాల్చడం పూర్తవగానే బొబ్బట్టుని ప్లేట్ లోకి తీసుకొని మళ్ళీ పైన కొద్దిగా నెయ్యి రాయాలి

నా చిట్కా:

బొబ్బట్లు సరిగ్గా రావాలంటే లోపలి పిండిని సరిగ్గా తయారు చేయాలి.పచ్చి సెనగ పప్పు ను సరిగ్గా ఉడికించాలి.

Reviews for Dry fruit obbatulu Recipe in Telugu (0)