బాదుషా | BAADUSHA Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • BAADUSHA recipe in Telugu,బాదుషా, Kavitha Perumareddy
బాదుషాby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

2

0

బాదుషా వంటకం

బాదుషా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BAADUSHA Recipe in Telugu )

 • మైదా పిండి 1/4 కేజీ
 • చెక్కర 1/2 కేజీ
 • నెయ్యి లేదా వెన్న 50 గ్రామ్స్
 • యాలకులు 6
 • .బేకింగ్ సోడా 1/4 స్పూన్
 • ఉప్పు చిటికెడు
 • పెరుగు 1 కప్
 • నిమ్మరసం 1/2 స్పున్
 • నూనె 1/2 కేజీ వేయించడానికి సరిపడా

బాదుషా | How to make BAADUSHA Recipe in Telugu

 1. ముందుగా మైదా పిండిని జల్లించి ఒక గిన్నెలో తీసుకుని కరిగించి న నెయ్యి, పెరుగు,సోడాపొడి,చిటికెడు ఉప్పు వేసి అంత బాగా కలపాలి.పిండి కొద్దిగా గట్టిగా ఉంటే నీళ్లు పోసి పూరీ పిండి లాగా కలుపుకోవాలి.
 2. ఈ పిండిని పది నిముషాలు నాననివ్వాలి.
 3. ఇప్పుడు పోయిమీద ఒక గిన్నెలో చెక్కర, కప్ వాటర్ వేసి పాకం పట్టుకోవాలి .తీగె పాకం వస్తే సరిపోతుంది. ముదురుగా వద్దు.ఇప్పుడు యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయ రసం వేసి మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.
 4. ఇప్పుడు పిండిని బాగా మర్దనా చేసి చిన్న చిన్న ముద్దాలుగా చేసి అరచేతిలో పెట్టి వత్తుకొని మధ్యలో బొటనవేలితో గుంతలాగా వత్తుకోవాలి.కింద ఫోటో లాగా రెడీ చేసుకోవాలి .
 5. .ఇప్పుడు పోయి మీద బాండీ పెట్టి నూనె వేసుకొని చిన్న మంట మీద వేడిచేయాలి.నూనె ఎక్కువగా కాగవద్దు. ఇప్పుడు నూనెలో బాదుషా లు వేసుకోవాలి ...అవి నెమ్మదిగా కాలుతూ పైకి తేలుతాయి అప్పుడు ఎక్కువ మంట పెట్టి వేయించాలి.రెండు పక్కల తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు మళ్ళీ చిన్న మంట మీద వేయించాలి.
 6. ఇప్పుడు కాలిన బాదుషాలను తీసి పాకంలో వేసి కలిపి 5 నిముసాలు ఉంచాలి .
 7. ఇప్పుడు పాకంలో నుండి తీసి వేరే పళ్ళెంలో వేసుకోవాలి.
 8. అంతే ఇక వేడి వేడి బాదుషా రెడీ ...ఇంకా తినడమే .

నా చిట్కా:

పాకంలో నిమ్మకాయరసం వేస్తే గట్టిగా అవకుండా ఉంటుంది. పాకం కాగే లోపు పిండిని బాదుషాలుగా వత్తుకుంటే సమయం ఆదా అవుతుంది.

Reviews for BAADUSHA Recipe in Telugu (0)