బెండకాయ పులుసు కూర | BENDAKAYA pulusu kura1 Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  13th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • BENDAKAYA pulusu kura1 recipe in Telugu,బెండకాయ పులుసు కూర, Kavitha Perumareddy
బెండకాయ పులుసు కూరby Kavitha Perumareddy
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

3

0

బెండకాయ పులుసు కూర వంటకం

బెండకాయ పులుసు కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BENDAKAYA pulusu kura1 Recipe in Telugu )

 • బెండకాయ లు పావుకేజీ
 • టమాటాలు 2
 • .పచ్చిమిర్చి3
 • ఉల్లిపాయ 1 పెద్దది
 • నూనె 1పెద్ద స్పున్
 • కారం టీ స్పూన్
 • పసుపు అరస్పూన్
 • ఉప్పు తగినంత
 • ధనియాలు పొడి చిన్న స్పున్
 • కొబ్బరిపొడి 2 స్పూన్స్
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పున్
 • చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్
 • పోపుగింజెలు1స్పున్
 • కరేపాకు కొద్దిగా
 • కొత్తిమీర గుప్పెడు

బెండకాయ పులుసు కూర | How to make BENDAKAYA pulusu kura1 Recipe in Telugu

 1. ముందుగా కూరగాయలు కడిగి చిన్న ముక్కలుగా తరగాలి.
 2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి వేడి చేసి పోపుగింజెలు వేసి వేగినతారువాత, కరివేపాకు కూడా వేసుకోవాలి
 3. ఇప్పుడు తాలింపులో ముందుగా ఉల్లిపాయ,పచ్చిమిర్చి ముక్కలు వేసి మగ్గించాలి.ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపి టమాటా ముక్కలు వేసుకొని కాసేపు మగ్గించాలి.
 4. ఇప్పుడు బెండకాయలు ,తగినంత ఉప్పు వేసి బెండకాయ మగ్గే వరకు ఉండి దానిలో పసుపు,కారం,ధనియాలు పొడి,కొబ్బరిపొడి వేసి కలపాలి.
 5. అంతా బాగా కలిపిన తరువాత చింతపండు నానబెట్టి రసం తీసి పోయాలి. గ్లాస్ ఉంటే సరిపోతుంది రసం.ఇప్పుడు 5 నిముసాలు ఉడికించాలి.
 6. కూర ఉడికిన తరువాత కొత్తిమీర చల్లు కోవాలి. అంతే చాలా రుచిగా వుండే బెండకాయ పులుసు కూర రెడీ.

నా చిట్కా:

ఏ కూర చేసేటప్పుడు ఐన ఉల్లిపాయ లు మగ్గే టప్పుడు కొంచెము ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి.

Reviews for BENDAKAYA pulusu kura1 Recipe in Telugu (0)