సొజ్జ భక్ష్యాలు | SWEET STUFFED POORI Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  17th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • SWEET STUFFED POORI recipe in Telugu,సొజ్జ భక్ష్యాలు, Sandhya Rani Vutukuri
సొజ్జ భక్ష్యాలుby Sandhya Rani Vutukuri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

సొజ్జ భక్ష్యాలు వంటకం

సొజ్జ భక్ష్యాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SWEET STUFFED POORI Recipe in Telugu )

 • బొంబాయి రవ్వ 1చిన్న గ్లాసుడు
 • పంచ దార అదే కొలత 1 గ్లాసుడు
 • నీళ్ళు 2 గ్లాసులు (పిండి తడపడానికి కూడా)
 • మైదా 2 గ్లాసులు
 • ఏలకుల పొడి చిటికెడు
 • 2 కప్పుల నూనె
 • మంద పాటి కవరు/అరటి ఆకు

సొజ్జ భక్ష్యాలు | How to make SWEET STUFFED POORI Recipe in Telugu

 1. ముందుగా 2 చిన్న గ్లాసుల మైదా ను రొట్టె పిండి లాగా కలుపుకొని 2 చెంచాల నూనె వేసి గంట సేపు మూత పెట్టి ఉంచాలి.
 2. ఒకే కొలత గ్లాసు తో 1 గ్లాసు నీళ్లు, 1గ్లాసు చెక్కెర, 1గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోవాలి.
 3. రవ్వ ని మూకుడు లో చిన్న మంట పై 3ని.లు వేయించు కుంటూ ఉండాలి.
 4. వేరొక గిన్నెలో కొలుచుకున్న గ్లాస్ నీటిని స్టవ్ పై పెట్టి మారిగించు కోవాలి.
 5. ఇప్పుడు వేగుతున్న రవ్వలో 1 గ్లాసు చెక్కెర వేసి, మరుగుతున్న నీరు పోసి ఏలకుల పొడి వేసి తిప్పుతుంటే హల్వా గట్టి పడుతుంది. వెంటనే దింపి పూర్తిగా చల్లార నివ్వండి.
 6. ఈ దశ లో ఒక కవర్ కానీ, అరటి ఆకు కానీ తీసుకొని బాగా నూనె రాసి మైదా ను పూరి లాగా వత్తు కోవాలి
 7. ఇప్పుడు ఆ పూరి పైన చిన్న నిమ్మకాయ పరిమాణం లో హల్వా ను పెట్టి పూరి ని మూయాలి
 8. ఈ దశ లో ఈ పూర్ణం పెట్టిన పూరీలు నూనె పూసిన కవర్ పై పూర్ణం బయటకు రాకుండా మెల్లగా వొత్తుకోవాలి.
 9. వీటిని వేడి నూనె లో ఎర్ర గా వేయించు కోవాలి.
 10. అంతే తీయని సొజ్జ భక్షాలు నైవేద్యానికి రెడీ.

నా చిట్కా:

మైదా ను తడిపి నూనె వేసుకోవాలి. పూరి వొతేటప్పుడు కవరు/ఆకు కు నూనె బాగా రాయాలి.

Reviews for SWEET STUFFED POORI Recipe in Telugu (0)