BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సొజ్జ భక్ష్యాలు

Photo of SWEET STUFFED POORI by Sandhya Rani Vutukuri at BetterButter
548
2
0(0)
0

సొజ్జ భక్ష్యాలు

Aug-17-2018
Sandhya Rani Vutukuri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొజ్జ భక్ష్యాలు రెసిపీ గురించి

శ్రావణ మాసం అమ్మ వారికి ఎంతో ప్రీతి కరమైన నెల. అందులో శుక్రవారంనాడు తప్పక తీపి నైవేద్యం పెడతాము. ఈరోజు నేను త్వరగా, తేలికగా చేసుకో గలిగిన తీపి వంటకం, నైవేద్యం కోసం చేసే తీపిపూరి చెప్తున్నాను. వీటిని కొన్ని ప్రాంతాల్లో సొజ్జె బూరెలు,సొజ్జ పూరీలు, సొజ్జ అప్పాలు అని కూడా అంటారు. ఇవ్వి ఫ్రిజ్ లో పెట్టుకుని 7 రోజులు, పెట్టా కుండా 2 రోజులు తినవొచ్చు. రుచి యెంత మాత్రం మారవు. చిన్న గ్లాసుడు రవ్వ కు 8 బూరెలు అవుతాయి..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఉత్తర భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బొంబాయి రవ్వ 1చిన్న గ్లాసుడు
  2. పంచ దార అదే కొలత 1 గ్లాసుడు
  3. నీళ్ళు 2 గ్లాసులు (పిండి తడపడానికి కూడా)
  4. మైదా 2 గ్లాసులు
  5. ఏలకుల పొడి చిటికెడు
  6. 2 కప్పుల నూనె
  7. మంద పాటి కవరు/అరటి ఆకు

సూచనలు

  1. ముందుగా 2 చిన్న గ్లాసుల మైదా ను రొట్టె పిండి లాగా కలుపుకొని 2 చెంచాల నూనె వేసి గంట సేపు మూత పెట్టి ఉంచాలి.
  2. ఒకే కొలత గ్లాసు తో 1 గ్లాసు నీళ్లు, 1గ్లాసు చెక్కెర, 1గ్లాసు బొంబాయి రవ్వ తీసుకోవాలి.
  3. రవ్వ ని మూకుడు లో చిన్న మంట పై 3ని.లు వేయించు కుంటూ ఉండాలి.
  4. వేరొక గిన్నెలో కొలుచుకున్న గ్లాస్ నీటిని స్టవ్ పై పెట్టి మారిగించు కోవాలి.
  5. ఇప్పుడు వేగుతున్న రవ్వలో 1 గ్లాసు చెక్కెర వేసి, మరుగుతున్న నీరు పోసి ఏలకుల పొడి వేసి తిప్పుతుంటే హల్వా గట్టి పడుతుంది. వెంటనే దింపి పూర్తిగా చల్లార నివ్వండి.
  6. ఈ దశ లో ఒక కవర్ కానీ, అరటి ఆకు కానీ తీసుకొని బాగా నూనె రాసి మైదా ను పూరి లాగా వత్తు కోవాలి
  7. ఇప్పుడు ఆ పూరి పైన చిన్న నిమ్మకాయ పరిమాణం లో హల్వా ను పెట్టి పూరి ని మూయాలి
  8. ఈ దశ లో ఈ పూర్ణం పెట్టిన పూరీలు నూనె పూసిన కవర్ పై పూర్ణం బయటకు రాకుండా మెల్లగా వొత్తుకోవాలి.
  9. వీటిని వేడి నూనె లో ఎర్ర గా వేయించు కోవాలి.
  10. అంతే తీయని సొజ్జ భక్షాలు నైవేద్యానికి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర