హోమ్ / వంటకాలు / బీట్రూట్ పులుసు

Photo of Beetrut sambaar by Shobha.. Vrudhulla at BetterButter
0
1
0(0)
0

బీట్రూట్ పులుసు

Aug-18-2018
Shobha.. Vrudhulla
600 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ పులుసు రెసిపీ గురించి

బీట్రూట్ సాంబార్ వేడి వేడిగా అన్నంతో తింటే వడియాలు పెట్టుకొని చాలా రుచిగా ఉంటుంది..ఇందులో ఉన్న పదార్ధాలు అన్ని ఆరోగ్యకరమైనవే..

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ఆంధ్రప్రదేశ్
 • ఉడికించాలి
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

 1. కందిపప్పు ఒక కప్పున్నర
 2. బీట్రూట్ మూడు
 3. టమోటాలు నాలుగు
 4. ఉల్లిపాయలు చిన్న సైజ్ వి పది
 5. చింతపండు అరకప్పు
 6. ఆవాలు ఒక చెంచా
 7. ఇంగువ ఓ రెండు చిటికెలు
 8. మెంతులు చిటికెడు
 9. ఎండు మిరపకాయలు మూడు
 10. కొబ్బరి తురుము రెండు చెంచాలు(ఎండు కొబ్బరి)
 11. పంచదార ఒక చిన్న చెంచా
 12. ఉప్పు తగినంత
 13. పసుపు కొంచెము
 14. కారము ఒక చెంచా
 15. ధనియాల గుండా ఒక చెంచా
 16. జీలకర్ర గుండా ఒక అరా చెంచా
 17. సాంబారు గుండ మూడు చెంచాలు
 18. కరివేపాకు రెండు రెబ్బలు

సూచనలు

 1. ముందుగా పప్పుని రెండు గంటలు వరకు నానా పెట్టాలి
 2. ఇప్పుడు టమాటాలు ఒక బీట్రూట్ బాగా కడిగి బీట్రూట్ కి తొక్క తీసి టమాటాలు బీట్రూట్ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి
 3. పప్పు కూడా బాగా నానిన తరువాత కూకర్లో వేసి బాగా మెత్తగా ఉడికించి పెట్టుకోవకేను...
 4. పప్పు బద్దలు ఉంటే యింకా హాండ్ గ్రైండర్ తో ఒక్కసారి తిప్పేస్తే సరిపోతుంది
 5. మిగిలిన బీట్రూట్ కూడా కడిగి తొక్కలు తీసి నచ్చిన ఆకారంలో కట్ చేయవలెను
 6. అలాగే ఉల్లిపాయలకి కూడా తొక్కతిసి కడిగి చిన్నవి అయితే పాలంగా ఉంచి మధ్యలో చిన్న గంటు పెట్టుకోవలెను.దానివల్ల లోపల కూడా రుచిగా ఉంటుంది
 7. పెద్ద ఉల్లిపాయలు అయితే నాలుగు ముక్కలుగా కట్ చేయాలి
 8. ఇప్పుడు గిన్నెకి స్టవ్ మీద పెట్టి నూనె వేసి కాగాక అందులో ఆవాలు...ఇంగువ...మెంతులు.. కరివేపాకు...ఎండు మీర్చి వేసి పోపు వేగనివ్వాలి
 9. ఇవి వేగాక అందులో తరిగిన ముక్కలు వేసి రెండునిమిషాలు వేగాక అప్పుడు రుబ్బిన టమాట బీట్రూట్ ముద్ద వేసి కాస్త వేగనీచ్చి మూడు గ్లాసులు నీళ్లు పోయాలి
 10. నిల్లుపోశాఖ ఉప్పు..పశువు...కారము...దనియా గుండా..జీకాకర గుండా..పంచదార..సాంబార్ గుండా కొంచెం వేసి చింతపండు కూడా పుల్ల తీసి పోయావలెను..
 11. అది ఉడుకు పట్టాక తగ్గించి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి..
 12. ఇప్పుడు ముక్కలు బాగా ఉడికాక అందులో రుబ్బి ఉంచిన పప్పు ముద్దని వేసి బాగా కలిపి ఉడక నివ్వాలి రెండునిమిషాలు
 13. బాగా ఉడికాక అప్పుడు అందులో మిగిలిన సాంబారు గుండా మరియు కొబ్బరి పొడి వేసి చక్కగా మరో రెండు నిమిషాలు ఉదకనివ్వండి..
 14. ఘుమఘుమలాడుతూ మంచి సువాసన వస్తూ ఉంటుంది అంతే.. స్టవ్ ఆర్పేసీ దించేయటమే
 15. కావాలి అవసరం అనుకుంటే దించాకా ఆఖరిగా మరో సారి పోపు పెట్టుకోవచ్చూ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర