ములక్కాడ బూందీ కూర | Drumstick Boondi Curry Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  21st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Drumstick Boondi Curry recipe in Telugu,ములక్కాడ బూందీ కూర, Sudha Badam
ములక్కాడ బూందీ కూరby Sudha Badam
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

4

0

ములక్కాడ బూందీ కూర వంటకం

ములక్కాడ బూందీ కూర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Drumstick Boondi Curry Recipe in Telugu )

  • ములక్కాడలు 3
  • టొమాటాలు 2
  • ఉల్లిపాయలు 2
  • బూందీ 100 గ్రాములు
  • పచ్చిమిర్చి 4
  • ధనియాల పొడి 1 స్పూన్
  • కారం 1 స్పూన్
  • ఉప్పు తగినంత
  • కొత్తిమీర కొద్దిగా
  • నూనె తగినంత
  • పోపు దినుసులు తగినంత

ములక్కాడ బూందీ కూర | How to make Drumstick Boondi Curry Recipe in Telugu

  1. బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు, పచ్చి మిర్చి,కరివేపాకు వేసి వేగనిచ్చి,ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగనిచ్చి టమాటా ముక్కలు వేసుకోవాలి.
  2. టమాటాలు కొద్దిగా మగ్గాక ములక్కాడ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
  3. మూత తీసి ములక్కాడలు మెత్తబడ్డాక ఉప్పు, పసుపు,కారం,ధనియాలపొడి వరసగా వేసుకుని అన్ని బాగా కలిసాక బూందీ వేసి మూత పెట్టి 5 నిమిషాలు కదపకుండా ఉంచాలి.
  4. 5 నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నీలోకి తీసుకోవాలి.

నా చిట్కా:

కూర సర్వ్ చేసుకునే 10 నిమిషాలు ముందు బూందీ వేసుకుంటే ఫ్రెష్ గా బాగుంటుంది.

Reviews for Drumstick Boondi Curry Recipe in Telugu (0)