బియ్యం పిండి ఆకుకూర కారం రొట్టె | Biyyam pindi karam rotte Recipe in Telugu

ద్వారా Pendekanti Suneetha  |  21st Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Biyyam pindi karam rotte recipe in Telugu,బియ్యం పిండి ఆకుకూర కారం రొట్టె, Pendekanti Suneetha
బియ్యం పిండి ఆకుకూర కారం రొట్టెby Pendekanti Suneetha
 • తయారీకి సమయం

  25

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

3

0

బియ్యం పిండి ఆకుకూర కారం రొట్టె వంటకం

బియ్యం పిండి ఆకుకూర కారం రొట్టె తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Biyyam pindi karam rotte Recipe in Telugu )

 • బియ్యము పిండి. 1 పెద్దకప్
 • సేనగపప్పు 1 స్పూన్
 • పెసరపప్పు. 1 స్పూన్
 • జీలకర్ర. 1 స్పూన్
 • పచ్చిమిర్చి పేస్ట్. 2 స్పూన్స్
 • ఉప్పు తగినంత
 • ఆయిల్ చిన్న కప్
 • కరివేపాకు చిన్నగా కట్ చేసినది 1 స్పూన్
 • కొత్తిమీర కట్ చేసినది. 2 స్పూన్స్
 • పాలకూర. కట్ చేసినది. 1 చిన్న కప్
 • తోటకూర. కట్ చేసినది. 1 చిన్న కప్
 • క్యారెట్ తురుము. 2 స్పూన్స్

బియ్యం పిండి ఆకుకూర కారం రొట్టె | How to make Biyyam pindi karam rotte Recipe in Telugu

 1. సేనగపప్పు, పెసరపప్పు ను అరగంట సేపు నానబెట్టాలి.
 2. ఒక గిన్నెలో బియ్యం పిండి,జీలకర్ర,నానబెట్టిన సేనగపప్పు, పెసరపప్పు, పచ్చిమిర్చి పేస్ట్,ఉప్పు,క్యారెట్ తురుము,కొత్తిమీర, కరివేపాకు,పాలకూర,తోటకూర అన్ని బాగా కలపాలి.
 3. ఈ పిండి కొద్దిగా తీసుకొని నీళ్లు వేసి గట్టిగా కలపాలి.చపాతీ పిండి లాగా కలపాలి.
 4. ఇప్పుడు మందంగా ఉన్న కవర్ పై ఆయిల్ వేసి దానిపై పిండి ముద్దను రొట్టెలగా పల్చగా తట్టాలి
 5. స్టవ్ పై పెన్నాం పెట్టి ఆయిల్ వేసి హీట్ చేయాలి హీట్ అయ్యాక కవర్ పై తట్టిన రొట్టెను కవర్ తో సహా పెన్నము పై వేయాలి.
 6. ఒక నిమిషం తర్వాత చిన్నగా కవర్ ను తీసేయాలి
 7. కాలిన తర్వాత రెండో వైపు తిప్పి కాల్చాలి.
 8. ఈ రొట్టెకు గోంగూర పప్పు తో చాలా బాగుంటుంది

Reviews for Biyyam pindi karam rotte Recipe in Telugu (0)