పాలతాలికులు. ఇది మా ఇంటి సాంప్రదాయక మైన వంట. | Milk mixed rice flour sweet Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  24th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Milk mixed rice flour sweet recipe in Telugu,పాలతాలికులు. ఇది మా ఇంటి సాంప్రదాయక మైన వంట., Dharani Jhansi Grandhi
పాలతాలికులు. ఇది మా ఇంటి సాంప్రదాయక మైన వంట.by Dharani Jhansi Grandhi
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    35

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

5

0

పాలతాలికులు. ఇది మా ఇంటి సాంప్రదాయక మైన వంట. వంటకం

పాలతాలికులు. ఇది మా ఇంటి సాంప్రదాయక మైన వంట. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Milk mixed rice flour sweet Recipe in Telugu )

  • బియ్యపు పిండి 1 కప్
  • బెల్లం 1 కప్
  • పాలు 3 కప్పులు
  • నెయ్యి కొద్దిగా
  • 1 కప్ నీళ్లు

పాలతాలికులు. ఇది మా ఇంటి సాంప్రదాయక మైన వంట. | How to make Milk mixed rice flour sweet Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి చిటికెడు ఉప్పు వేసి ,బెల్లం చిన్న ముక్క వేసి ఎసరు మరగ నివ్వాలి.
  2. మరిగాక స్టౌవ్ ఆఫ్ చేసి అందులో బియ్యపుపిండి వేసి కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి.ఆ తరువాత పిండి అంత మెత్తగా ముద్దలా నొక్కి చిన్న చిన్న ముక్కలుగా గా చేసుకోవాలి సగం పిండి తాలికులికి తీసి సగం పిండి లో నీళ్లు పోసి ఉండలు లేకుండా జారు గా కలిపి వుంచుకోవాలి.
  3. చేతికి కొద్దిగా నెయ్యి రాసి తాలుకులికి తీసిన పిండి నీ చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పైన చూపించిన విధంగా గా తాలికు లు చేసుకుని పక్కన పెట్టాలి.
  4. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టీ పాలు మరిగించాలి పాలు మరిగాక తాలికులు వేసి ఉడక నివ్వాలి అవి ఉడికాక పైకి తేలుతాయి .
  5. పొయ్యి సిమ్ లో పెట్టీ చేసుకోవాలి .తాలుకులు తేలిన తర్వాత జారు గా కలిపిన పిండి నీ పోసి ఉడక నిచ్చి బాగా కుత కుత లాడక స్టౌవ్ ఆఫ్ చేసి ఒక కప్ బెల్లం వేసి కలిపి దించేయాలి.
  6. బెల్లం పొడి ల కొట్టుకుని వుంచుకోవాలి.బెల్లం కరగక పోతే పొయ్యి సిమ్ లో పెట్టీ కలిపి కట్టేయలి.అంతే పాలతలికులు రెడీ.

నా చిట్కా:

పొయ్య మీద వుంచి బెల్లం కలపకూడదు.. స్టౌవ్ ఆఫ్ చేసి బెల్లం కలపాలి .

Reviews for Milk mixed rice flour sweet Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo