BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కదంబం

Photo of Kadambam by మనస్విని శెట్టి at BetterButter
0
4
0(0)
0

కదంబం

Aug-27-2018
మనస్విని శెట్టి
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కదంబం రెసిపీ గురించి

రోజు చేసుకునే కూరలు ఒకటి ఒకటి మిగిలిపోతే ఇలా కదంబం చేసుకోవచ్చు. దసరా రోజుల్లో చేసుకునేది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. వంకాయలు 4
  2. గుమ్మడికాయ ముక్కలు 1/2 కప్పు
  3. బూడిద గుమ్మడికాయ ముక్కలు 1/2
  4. ఆనపకాయ ముక్కలు 1/2 కప్పు
  5. టమోటాలు ముక్కలు 1/2 కప్పు
  6. పచ్చిమిర్చి చీలికలు 1/4 కప్పు
  7. కందిపప్పు 1 కప్పు
  8. బియ్యం 3 కప్పులు
  9. పచ్చి శనగపప్పు 3 స్పున్లు
  10. మినప్పప్పు 3 స్పూన్లు
  11. ఎండుమిర్చి 10
  12. ఆవాలు 1 స్పూను
  13. జీలకర్ర 1 స్పూను
  14. ఇంగువ 1/4 స్పూను
  15. నూనె 4 స్పూన్లు
  16. ఉప్పు సరిపడా
  17. పసుపు 1 /4 స్పూను
  18. చింతపండు పులుసు 1 కప్పు
  19. మిరియాలు 1 స్పూను
  20. బెల్లం తురుము 1/2 కప్పు
  21. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా కందిపప్పు ఉడకబెట్టి పక్కనపెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి
  3. పాన్లో 2స్పూన్లు పచ్చి శనగపప్పు,2 స్పూన్లు మినప్పప్పు, 1 స్పూను మిరియాలు,5 ఎండుమిర్చి వేయాలి
  4. ఇవన్ని పాన్లో నూనె లేకుండా దోరగా వేయించాలి
  5. ఈ వేగిన వాటిని చల్లారిన తరువాత మిక్సీ చేసుకుని మసాలా లా పొడి చేసుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకుని నూనె వేయాలి
  7. నూనె వేడెక్కిన తరువాత కూరలు అన్ని రకాలు వేసి ఉప్పు ,పసుపు వేసి మగ్గించాలి
  8. ఈ కూరలు కొంచెం మగ్గిన తరువాత చింతపండు పులుసు వేయాలి
  9. ఈ పులుసు మరుగుతుండగా బెల్లం తురుము, ముందుగా సిద్ధం చేసుకున్నా మసాలా వేయాలి
  10. ఇప్పుడు ఈ పులుసులో కడిగిన బియ్యం వేయాలి
  11. ముందుగా ఉడకపెట్టిన పప్పు వేయాలి
  12. సరిపడా నీళ్లు పోయాలి
  13. రుచికి సరిపడా ఉప్పు వేయాలి
  14. బియ్యం ముక్కలు తో పాటు బాగా ఉడికిన తరువాత దించుకోవాలి
  15. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేయాలి
  16. నూనె వేడెక్కిన తరువాత, ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి, ఇంగువ ,కరివేపాకు వేసి తిరుగుమాత సిద్ధం చేసుకోవాలి
  17. ఇప్పుడు ఈ తిరుగుమాత కదంబంలో వేయాలి
  18. కదంబం సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర