మసాలా గారెలు(శనగవడలు) | Chick peas snacks Recipe in Telugu

ద్వారా Swapna Tirumamidi  |  27th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Chick peas snacks recipe in Telugu,మసాలా గారెలు(శనగవడలు), Swapna Tirumamidi
మసాలా గారెలు(శనగవడలు)by Swapna Tirumamidi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

3

0

మసాలా గారెలు(శనగవడలు) వంటకం

మసాలా గారెలు(శనగవడలు) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chick peas snacks Recipe in Telugu )

 • కొమ్ము శనగలు 1/4 కేజీ
 • పచ్చి మిర్చి 6
 • అల్లం ముక్క 2అంగుళాలంత
 • జీలకర్ర ఒక చెంచా
 • తరిగిన ఉల్లిపాయ ముక్కలు
 • కరివేపాకు గుప్పెడు
 • ఉప్పు సరిపడా
 • కాస్త పసుపు
 • వేయించడానికి సరిపడా నూనె.

మసాలా గారెలు(శనగవడలు) | How to make Chick peas snacks Recipe in Telugu

 1. ముందురోజు శనగలు శుభ్రం చేసి నానపెట్టుకోవాలి.
 2. మర్నాడు శనగలు వడపోసి పక్కన ఉంచాలి.
 3. ఇప్పుడు మిక్సీ జార్లో శనగలు ,కొద్దిగా జీలకర్ర, అల్లంముక్క ,ఉప్పు, పసుపు కాస్త,పచ్చి మిర్చి వేసి నీరు లేకుండా గట్టిగా రుబ్బుకోవాలి. కాస్త పలుకుగా రుబ్బుకుంటే వడలు కరకరలాడతూ బావుంటాయి.
 4. ఇప్పుడు ఆ రుబ్బిన ముద్ద ని గిన్నీలోకి తీసుకుని ఉప్పు సరి చూసి, ఉల్లి పాయ ముక్కలు,కరివేపాకు ని సన్నగా తరిగివేసి మిగిలిన జీలకర్ర వేసి కావాలంటే పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి బాగాకలిపి పక్కన పెట్టాలి.
 5. మూకుడు పొయ్యిమీద పెట్టి నూనె పోసి బాగా కాగిన తరువాత మంటను కాస్త తగ్గించి తయారు చేసుకున్న ముద్దని ఒక చెంచాడు చప్పున తీసుకొంటూ అరచేతిలో వడల్లా వత్తి నూనెలో వేయించుకోవాలి. బాగా పలచగా లేదా బాగా లావుగా కాకుండా మధ్యస్తంగా వత్తి వేయాలి. ఎర్రగా వేగిన తరువాత వేడివేడిగా వడ్డించడమే..చట్నీ గిట్నీలు అవసరం లేకుండానే అరడజను సులువుగా తినవచ్చు.

నా చిట్కా:

శనగలు కాస్త మొలక వచ్చిన తర్వాత రుబ్బుకుంటే...ఇంకా ఆరోగ్యం. వడలుగా ఆకారం లేదా పుణుకులుగా కూడా వేసుకోవచ్చు.

Reviews for Chick peas snacks Recipe in Telugu (0)