హోమ్ / వంటకాలు / మజ్జిగ పులుసు

Photo of Buttermilk soup ( I dont know exact name) by Swapna Tirumamidi at BetterButter
101
6
0.0(0)
0

మజ్జిగ పులుసు

Aug-27-2018
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మజ్జిగ పులుసు రెసిపీ గురించి

మజ్జిగపులుసు అనేది పాతకాలం వంటకమే కానీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా పిలుస్తారు.చేసే విధానంలో కూడా చిన్న చిన్న మార్పులు ఉంటాయి.నేను మా ఇంట్లో చేసే ఒక విధానం మీకు వివరిస్తాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 10

  1. చిక్కని పుల్ల/కమ్మటి మజ్జిగ ఒక లీటరు
  2. ఆనపకాయ ముక్కలు ఒక కప్పు
  3. ములక్కాడ ముక్కలు ఒక కప్పు
  4. బెండకాయ ముక్కలు ఒక కప్పు
  5. కేరెట్(కావాలంటే) ఒకటి
  6. పచ్చి మిర్చి 4
  7. పచ్చి కొబ్బరి ముక్క చిన్నది.
  8. జీలకర్ర అర చెంచా
  9. ధనియాలు ఒక చెంచా
  10. పెసర/శనగ పిండి 3 చెంచాలు.(నేను పెసర పిండి వాడాను.)
  11. అల్లంముక్క చిన్నది
  12. నెయ్యి 2 చెంచాలు
  13. పసుపు, ఉప్పు కొద్ది గా
  14. పోపునకు...ఆవాలు, జీలకర్ర,మెంతులు, వాము,ఇంగువ... అన్ని పావు చెంచాడు చప్పున.
  15. ఎండుమిర్చి 4
  16. కరివేపాకు ,కొత్తిమీర కొద్దిగా
  17. చివరలో ఆవపెట్టుకోడానకి ....ఆవాలు 2చెంచాలు.

సూచనలు

  1. ముందు కూరముక్కలన్నీ కావలసిన సైజులో తరిగి ఒక పెద్ద గిన్ని లో వేసి బెండకాయ మినహా అన్ని వేసి,2 పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు ,ముక్కలు మునిగేవరకూ నీరు పోసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించాలి.
  2. కూర ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి ఉడికించాలి.. ఇలా చేయడం వల్ల బెండకాయ ముక్కలు సమంగా ఉడికి ,విడిపోకుండా ఉంటాయి.
  3. ఈలోగా.. 2 చెంచాల ఆవాలు, ఒక ఎండుమిర్చి ఒక చిన్న గిన్ని లో వేసి వేడి నీరు పోసి పక్కన పెట్టుకోవాలి.
  4. మజ్జిగ ఒక పెద్ద గిన్ని లోకి తీసుకుని, కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి.ఛాయపసుపు వాడితే పులుసు మంచి రంగు తో బావుంటుంది.
  5. తర్వాత ఒక మిక్సీ జారులో...అల్లం ,కొబ్బరి,ఒక పచ్చి మిర్చి, జీలకర్ర, ధనియాలు, పెసర/శనగ పిండి వేసి కొంచెం నీరు పోసి ...మెత్తగా‌ ,జారుగా రుబ్బుకోవాలి.
  6. ఈ మిశ్రమాన్ని మజ్జిగ లో వేసి కలపి పక్క పొయ్యిమీద...,సన్నని మంట మీద ఉంచి,మధ్యలో కలుపుతూ ఉండాలి.
  7. ఈలోగా కూరముక్కలన్నీ ఉడికి నీరు ఇగిరి ఉంటాయి..ఈ ముక్కలు ఉడుకుతున్న మజ్జిగ లో వేసి కొత్తిమీర వేసి మరికొద్ది సేపు .... అంటే పెసరపిండి పచ్చి వాసన పోయేదాకా ఉడికించాలి..మంట చిన్నదే ఉండాలి.... లేకపోతే మజ్జిగ విరిగిపోతుంది.
  8. ఈలోగా మిక్సీలో... నానపెట్టిన ఆవాలు ,ఎండుమిర్చి ని పేస్టులా చేసి ,చిటికెడు ఉప్పు, రెండు నూనె చుక్కలు వేసి కలిపి ,ఘాటు పోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి....నూనె...ఉప్పు వెయ్యడం వల్ల ఆవముద్ద కండ్ర ఎక్కకుండా ఉంటుంది.
  9. ఈపాటికి మజ్జిగ పులుసు బాగా ఉడికిపోతుంది...పోపు గరిట పెట్టి నెయ్యి వేసి కాగాక ఆవాలు,వాము జీలకర్ర, మెంతులు,ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ వేసి ,కరివేపాకు... చక్కగా ఘుమ ఘుమలడేలా వేయించి పోపు పెట్టి వెంటనే మూత పెట్టి ,మంట ఆపేయ్యాలి.
  10. ఓపదినిముషాలు పోయాక రెడీచేసుకున్న ఆవముద్ద ను ఈ మజ్జిగపులుసు లో బాగా కలిపితే రుచికరమైన మజ్జిగపులుసు తినడానికి సిధ్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర