మామిడిపండు కేసరి | Mango ravva kesari Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mango ravva kesari recipe in Telugu,మామిడిపండు కేసరి, Lalitha Kandala
మామిడిపండు కేసరిby Lalitha Kandala
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

3

0

మామిడిపండు కేసరి వంటకం

మామిడిపండు కేసరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango ravva kesari Recipe in Telugu )

  • మామిడి పండు గుజ్జు 1 కప్
  • గోధుమ రవ్వ 1 కప్
  • పంచదార 1 కప్ లేదా రుచికి సరిపడా
  • యాలకుల పొడి 1 చెంచా
  • జీడిపప్పు , కిస్మిస్, బాదం పలుకులు 2 టేబుల్ స్పూన్స్
  • నెయ్యి 1/2 కప్

మామిడిపండు కేసరి | How to make Mango ravva kesari Recipe in Telugu

  1. మామిడి పండు ను మిక్సీలో వేసి గుజ్జు గా చేసుకుని పక్కన పెట్టాలి.
  2. ఒక పాన్ లో 3 చెంచాల నెయ్యి వేసి నట్స్ అన్ని వేయించుకుని తీసుకుని పక్కన పెట్టాలి
  3. అదే పాన్ లో కొంచం నెయ్యి వేసి రవ్వను వేయించి పక్కన పెట్టాలి
  4. ఒక గిన్నెలో 4 కప్స్ నీళ్లు పోసి బాగా మరిగాక రవ్వను వేసి వెంటనే ఉండలు లేకుండా కలపాలి
  5. అందులో పంచదార, మామిడి పండు గుజ్జు కూడా వేసి బాగా కలపాలి
  6. యాలకులు పొడి, నెయ్యి కూడా వేసి కాసేపు ఉడకనివ్వాలి
  7. చివరగా వేయించుకున్న నట్స్ అన్ని వేసి బాగా కలిపి దించాలి

Reviews for Mango ravva kesari Recipe in Telugu (0)