హోమ్ / వంటకాలు / లక్ష్మీ చారు

Photo of Lakshmi charu by మనస్విని శెట్టి at BetterButter
494
2
0.0(0)
0

లక్ష్మీ చారు

Aug-29-2018
మనస్విని శెట్టి
4320 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

లక్ష్మీ చారు రెసిపీ గురించి

ఇది పురాతన కాలం నుండి పల్లెల్లో ముఖ్యంగా ప్రతి రైతు ఇళ్లల్లో చేసుకునే బలమైన వంటకం

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యం కడిగిన నీళ్లు 1 కప్పు
  2. అన్నం వార్చిన గంజి 1 కప్పు
  3. టమోటా ముక్కలు 1/2కప్పు
  4. బెండకాయ ముక్కలు 1/2 కప్పు
  5. ఆనపకాయ ముక్కలు 1/2 కప్పు
  6. పచ్చిమిర్చి 4
  7. కందిపప్పు 1 కప్పు
  8. ఉప్పు 2 స్పూన్లు
  9. కారం 1 స్పూను
  10. ఆవాలు 1/2 స్పూను
  11. జీలకర్ర 1/2 స్పూను
  12. ఎండుమిర్చి 3
  13. కరివేపాకు ఒక రెమ్మ
  14. ఇంగువ 1/8 స్పూను
  15. నూనె 2 స్పూన్లు
  16. పసుపు 1 స్పూను

సూచనలు

  1. బియ్యం కడిగిన నీళ్లు, అన్నం వార్చిన గంజి ఒక కుండలో పోసుకోవాలి
  2. ఈ గంజి ని రెండు రోజులు పులవనివ్వాలి
  3. ముడవరోజు ఆ గంజి తీసుకోవాలి
  4. కందిపప్పు ని మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఈ గంజి వేయాలి
  6. ఈ గంజిలో టమోటా,బెండకాయ,ఆనపకాయ ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి
  7. ఇది ఇలా మారుగుతుండగా ముందుగా ఉడక్కబెట్టిన పప్పు కూడా వేయాలి
  8. ఇందులో ఉప్పు,కారం,పసుపు వేసుకోవాలి
  9. చారు బాగా మరిగి,ముక్కలు అన్ని ఉడికిన తరువాత దించుకోవాలి
  10. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు,జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు సిద్ధం చేసుకోవాలి
  11. ఈ తాలింపు మరిగిన చారులో వేసుకోవాలి
  12. లక్ష్మీ చారు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర