హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ మెంతి పులుసు

Photo of TANGY Onion methi gravy by Sridevi Vedantham at BetterButter
57
2
0.0(0)
0

ఉల్లిపాయ మెంతి పులుసు

Aug-29-2018
Sridevi Vedantham
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ మెంతి పులుసు రెసిపీ గురించి

ఇది మా అమ్మమ్మ గారు చాలా బాగా చేసేవారు, మా అమ్మ నాకు నేర్పారు ఈ రుచికరమైన తేలికైన వంటకం:yum::yum:

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లిపాయలు - 4
  2. చింతపండు - పెద్ద సైజు నిమ్మ కాయ అంత
  3. నీరు - 3/4 లీటర్
  4. ఉప్పు - 1 టేబుల్ స్పూన్
  5. పసుపు - 1/4 టీ స్పూన్
  6. ఎండు మిరపకాయలు - 4
  7. చెక్కర లేదా బెల్లం - 1 స్పూన్
  8. బియ్యప్పిండి - 1 టేబుల్ స్పూన్
  9. ఆవాలు - 1/4 టీస్పూన్
  10. మెంతులు - 2 టీ స్పూన్లు
  11. పచ్చి సెనగపప్పు, మినప్పప్పు - 1/4 టీస్పూన్ చొప్పున
  12. కొత్తిమీర - 1/4 కట్ట
  13. కరివేపాకు - 2 రెమ్మలు
  14. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి
  2. స్టవ్ పైన పాన్ పెట్టి అందులో 1 స్పూన్ నూనె వేసి వరుసగా, ఆవాలు, మెంతులు, మినప్పప్పు, సెనగపప్పు, జీరా, ఎండు మిరపకాయలు , ఇంగువ వేసి మెంతులు ఎర్రగా వేగనిఛ్చి అందులో ఉల్లిపాయలు,కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
  3. ముందుగా నాన పెట్టిన చింతపండు పిండి రసం తీసి వేగుతున్న ఉల్లిపాయ ల్లో పోసి, ఉప్పు, చెక్కర, పసుపు, వేసి 750మి. లీ నీరు పోసి 7 నిమిషాలుబాగా మరగనిఛ్చి,
  4. ఆఖరున చిన్న గిన్నెలో బియ్యప్పిండి లో నీరు కలిపి పల్చగా చేసి, మరుగుతున్న పులుసు లో పోసి 1 నిమిషం తర్వాత కొత్తిమీర వేసి దించేయాలి.
  5. ఘుమ ఘుమ లాడే రుచికరమైన ఉల్లిపాయ మెంతి పులుసు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర