హోమ్ / వంటకాలు / నోరూరించే పెరుగు వడ

Photo of Mouth watering curd vada by Sridevi Vedantham at BetterButter
313
3
0.0(0)
0

నోరూరించే పెరుగు వడ

Aug-29-2018
Sridevi Vedantham
240 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నోరూరించే పెరుగు వడ రెసిపీ గురించి

తరతరాల అపూర్వమైన, అద్భుతమైన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 4

  1. మినప్పప్పు - 2 కప్పులు
  2. నీరు - నాన పెట్టడానికి సరిపడా
  3. ఉప్పు - రుచికి సరిపడా
  4. పచ్చి మిర్చి - 2
  5. ఎండు మిర్చి - 1
  6. అల్లం - చిన్న ముక్క
  7. పెరుగు - 1 లీటర్
  8. కొత్తిమీర - కొద్దిగా
  9. ఆవాలు, జీర, మినప్పప్పు, ఇంగువ
  10. తమలపాకు

సూచనలు

  1. ముందుగా మినప్పప్పు, సరిపడా నీరు పోసి 3 గంటల పాటు నానపెట్టాలి
  2. 3 గంటల తర్వాత నీరు మొత్తం వడ కట్టి, గ్రైండర్ లో కొద్దిగా నీరు పోసి పిండి గట్టిగ ఋబ్బు కోవాలి.
  3. పచ్చి మిర్చి, అల్లం, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకోవాలి.
  4. పెరుగులో తగిన ఉప్పు వేసి బాగా కలిపి, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి కలపి పెట్టుకోవాలి
  5. స్టవ్ పై బాణలి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి బాగా వేడి చెయ్యాలి
  6. ఇప్పుడు రుబ్బిన పిండి లో రుచికి తగినంత ఉప్పు వేసుకుని తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, జీర వేసుకుని కలుపుకోవాలి.
  7. ఒక పెద్ద సైజు తమలపాకు పై కొంచెం కొంచెం పిండి తీసుకుని మధ్యలో చిల్లు పెట్టి, గారెలు కాగుతున్న నూనె లో వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి.
  8. సిద్ధం చేసుకున్న పెరుగులో గారెలు వేసి 10 నిమిషాలు నాన నివ్వాలి.
  9. వడ్డించే ముందు కొద్దిగా నూనె లో ఆవాలు, మినప్పప్పు, జీర, ఎండు మిర్చి ముక్కలు వేసి, ఇంగువ వేసి పెరుగులో నుంచి తీసి ప్లేట్ లో గారెలు తీసుకుని వాటి పై ఈ పోపు వేసి కొత్తిమీర వేసి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర