గోధుమపిండి కేక్ | Wheat flour cake eggless Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  30th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Wheat flour cake eggless recipe in Telugu,గోధుమపిండి కేక్, Lalitha Kandala
గోధుమపిండి కేక్by Lalitha Kandala
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  40

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

11

0

గోధుమపిండి కేక్ వంటకం

గోధుమపిండి కేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Wheat flour cake eggless Recipe in Telugu )

 • గోధుమపిండి 1 1/2 కప్
 • పంచదార 3/4 కప్ లేదా 1 కప్
 • నూనె 3/4 కప్
 • బేకింగ్ పౌడర్ 1టీ స్పూన్
 • బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్
 • వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్
 • ఉప్పు చిటికెడు

గోధుమపిండి కేక్ | How to make Wheat flour cake eggless Recipe in Telugu

 1. ముందుగా గోధుమపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు తీసుకుని జల్లించి పెట్టుకోండి.
 2. ఒక గిన్నెలో పంచదార, నూనె, vanilla ఎస్సెస్న్స్ వేసి బాగా కలపాలి
 3. ఇప్పుడు గోధుమపిండి మిశ్రమాన్ని( జల్లించిన పిండిని ) పంచదార మిశ్రమంలో వేసి గరిట తో కలుపుకోండి .. ఎక్కువగా కలపకూడదు.
 4. ఓవెన్ ను పది నిమిషాల ముందు 180 degrees వద్ద వేడి చేసి సిద్ధం పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు.
 5. ఇప్పుడు మొత్తం కేకు మిశ్రమాన్ని నెయ్యి లేదా నూనె లేదా బట్టర్ రాసుకున్న బేకింగ్ ట్రే లో వేసి పైన మీకు నచ్చిన పలుకులు వేసుకోవాలి.
 6. ఈ ట్రే ను ఓవెన్ లో పెట్టి 180 degree లో 30 - 40 నిమిషాల పాటు బేక్ చెయ్యాలి. తరువాత ఒవేన్ తెరిచి ఒక టూత్ పిక్ తో గుచ్చి చూస్తే కేక్ అంటుకోకుండా ఉండాలి. అప్పుడు కేక్ రెడి అయినట్లే.

Reviews for Wheat flour cake eggless Recipe in Telugu (0)