కిచిడి | Mixed dal kichidi Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  1st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mixed dal kichidi recipe in Telugu,కిచిడి, Chandrika Marripudi
కిచిడిby Chandrika Marripudi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

కిచిడి వంటకం

కిచిడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mixed dal kichidi Recipe in Telugu )

  • బియ్యం: 1గ్లాస్
  • పెసరపప్పు: 1/4 కప్
  • కందిపప్పు: 1/4 కప్
  • పచ్చి శనగపప్పు: 1/4 కప్
  • ఉల్లిపాయ: 1
  • టొమాటోలు : 2
  • క్యారెట్: 2
  • పచ్చిమిర్చి: 3
  • జీలకర్ర: 1 స్పూన్
  • దాల్చిన చక్క: చిన్నముక్క
  • లవంగాలు: 4
  • కరివేపాకు: 2 రెమ్మలు
  • కొత్తిమీర: కొద్దిగా
  • నూనె : 4 స్పూన్లు
  • ఉప్పు: తగినంత

కిచిడి | How to make Mixed dal kichidi Recipe in Telugu

  1. ముందుగా బియ్యం, పప్పులు అన్ని కలిపి నీళ్లు పోసి కడిగి పెట్టుకోవాలి.
  2. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక చక్క,లవంగాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి
  3. తరువాత తరిగిన కూరగాయల ముక్కలు వేసి కలపాలి.
  4. కూర ముక్కలు మగ్గాక బియ్యం, పప్పుల మిశ్రమం వేసి కలపాలి.
  5. ఇపుడు బియ్యం పప్పులు కలిపి ఎంతుంటే దానికి రెట్టింపు నీళ్లు పోసుకోవాలి.1కి 2 గ్లాసులు పోసుకోవాలి
  6. ఇపుడు తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. చివరలో కొత్తిమీర వేసి కలపాలి.
  7. కుక్కర్లో 3 విజిల్స్ వరకు ఉడికిస్తే సరిపోతుంది.

నా చిట్కా:

దీనిలో నచ్చిన కూరగాయలతో పాటు పాలకూర కూడా వేస్తే చాలా బాగుంటుంది.

Reviews for Mixed dal kichidi Recipe in Telugu (0)