గిన్నెరోట్టి | G i nn e r o t t i Recipe in Telugu

ద్వారా Pranavee Ganti  |  1st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • G i nn e r o t t i recipe in Telugu,గిన్నెరోట్టి, Pranavee Ganti
గిన్నెరోట్టిby Pranavee Ganti
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

గిన్నెరోట్టి వంటకం

గిన్నెరోట్టి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make G i nn e r o t t i Recipe in Telugu )

  • 2 కప్పుల మినపప్పు
  • 4 కప్పుల ఇడ్లీ రవ్వ
  • 1 స్పూన్ ఉప్పు

గిన్నెరోట్టి | How to make G i nn e r o t t i Recipe in Telugu

  1. ముందు రోజు రాత్రి 2 కప్పుల మినపప్పు కడిగి నానపెట్టాలి.
  2. తర్వాతి రోజు నానపెట్టిన మినపప్పు ని గ్రైండర్లో వేసి ఇడ్లీ పిండిలా మెత్తగా రుబ్బుకుని పాత్రలోకి తీసుకోవాలి. 3,4 కప్పుల ఇడ్లీ రవ్వని బాగా కడిగి నానపెట్టాలి
  3. నానిన రవ్వ ని నీరు పిండి రుబ్బిన మినపిండిలో వెయ్యాలి.ఈ రవ్వలో సాల్ట్ వేసి పిండిని బాగా కలిపి 4గం లు పక్కనపెట్టుకోవాలి.
  4. స్టవ్ పైన మందంగా వుండే పాత్రపెట్టుకోవాలి . పాత్ర బాగా వేడి అయ్యాక ఆయిల్ వేసి ఇడ్లీ పిండిని కొంచం ఎక్కువగానే వెయ్యాలి.
  5. చుట్టూ నూనె వేసి పొయ్యి సిమ్ లో పెట్టి 10ని లు మూత పెట్టి ఉంచాలి. నెమ్మదిగా ఆ రొట్టిని తిరగవెయ్యాలి
  6. రెండోవ వైపు కూడా ఇంకో 10 ని ఉంచి ఎర్రగా కాలిన రొట్టిని నచ్చిన చట్నీతో తింటే అద్భుతం.ఇది చాలా పాతకాలపు వంట.

నా చిట్కా:

గిన్నెరొట్టెలో ఇడ్లీ రవ్వ కంటే బియ్యపు రవ్వ వేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది.ఇది పిల్లలకి పెద్దలకి చాలా బలమైన ఆహారం.

Reviews for G i nn e r o t t i Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo