మువ్వన్నెల పూరి | THIRANGA POORI Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  3rd Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • THIRANGA POORI recipe in Telugu,మువ్వన్నెల పూరి, Sandhya Rani Vutukuri
మువ్వన్నెల పూరిby Sandhya Rani Vutukuri
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  1

  జనం

0

0

మువ్వన్నెల పూరి వంటకం

మువ్వన్నెల పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make THIRANGA POORI Recipe in Telugu )

 • గోధుమపిండి 1 కప్పు
 • క్యారెట్ 1
 • పాల కూర 1 కట్ట
 • కుంకుమ పువ్వు 2 రేకులు/కేసరి రంగు
 • ఉప్పు చిటికెడు
 • మైదా 1/4 కప్పు
 • నూనె 2 కప్పులు

మువ్వన్నెల పూరి | How to make THIRANGA POORI Recipe in Telugu

 1. క్యారేట్ ను సన్న గా తురమండి
 2. దాన్ని వడకట్టండి.
 3. ఎక్కువ రంగు కోసం ఆ జ్యూస్లో 1 కుంకుమ పూవు లేదా కేసరి రంగు వేయండి.
 4. ఇప్పుడు ఈ నీటితో చాలా తక్కువ ఉప్పు వేసి సగం కప్పు గోధుమ పిండి ని పూరి పిండి ల తడపండి.
 5. పాలకూర శుభ్రం చేసి, బాగా మరిగే నీళ్ల లో వేసి, 2 ని.లు ఉంచి నీరు లేకుండా తీసి, రుబ్బుకోండి.
 6. ఈ పాలకూర ముద్ద కు చిటికెడు కంటే తక్కువ ఉప్పు వేసి గోధుమపిండి కలపండి.
 7. మైదా పిండి ని తీసుకొని పూరి పిండి లా కలుపుకోవాలి.
 8. ఇప్పుడు మనకు 3 జెండా రంగుల తో పిండి తయారయింది. దాన్ని ఒకదాని తరువాత ఒకటి పెట్టండి.
 9. వేలు తో దగ్గర గా వుండ చేయండి
 10. పూరీలు గా వొత్తు కోండి.
 11. కాల్చి పిల్లల కు ఇష్టమైన జామ్ తో లేదా కూర తో డబ్బా సిద్ధం చేయండి.

నా చిట్కా:

చిటికెడు ఎర్ర కారం క్యారెట్ జ్యూస్ లో, పాలక్ లో ఒకసగం మిర్చి, మైదా లో పెప్పర్ వేస్తే కూర అవసరం ఉండదు. రుచిగా ఉంటుంది.

Reviews for THIRANGA POORI Recipe in Telugu (0)