హోమ్ / వంటకాలు / ఆకాకరకాయ వేపుడు ,వంకాయ టమాటో పచ్చడి

Photo of Akakarakaya fry, brinjal tomato chutney by Sree Sadhu at BetterButter
159
5
0.0(0)
0

ఆకాకరకాయ వేపుడు ,వంకాయ టమాటో పచ్చడి

Sep-04-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకాకరకాయ వేపుడు ,వంకాయ టమాటో పచ్చడి రెసిపీ గురించి

ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడి వేపుడు చాల మంచి కాంబినేషన్ ఇది చాల బాగుంటుంది లంచ్ లోకి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. ఆకాకరకాయ వేపుడు :
  2. ఆకాకరకాయ 1/2 కేజీ
  3. నూనె వేయించడానికి సరిపడా
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. వంకాయ టమాటో పచ్చడి
  7. వంకాయ 1/4 కేజీ
  8. టమాటో 5-6
  9. పచ్చిమిర్చి 2-3
  10. ఉప్పు తగినంత
  11. కారం తగినంత
  12. ఎండుమిరపకాయలు 1
  13. నూనె 3-4 చెంచాలు
  14. ఆవాలు 1/2 చెంచా
  15. ఇంగువ చిటికెడు
  16. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ఆకాకరకాయ వేపుడు :ముందుగా కాకరకాయలని చక్రాలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె పోసి వేడి అవ్వనివ్వాలి
  3. అందులో తరుగుకున్న కాకరకాయలు వేసి ఎర్ర వేయించుకోవాలి
  4. అవి వేగిన తరువాత అందులో నూనె వార్చేయాలి
  5. నూనె వార్చిన తరువాత అందులో ఉప్పు ,కారం వేసి మరో నిమిషం వేయించి సర్వ్ చేసుకోవడమే
  6. వంకాయ టమాటో పచ్చడి :ముందుగా వంకాయలని ,టొమాటోలిని, పచ్చిమిర్చి ని తరుగుకోవాలి
  7. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి తరిగిన వంకాయలు పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి
  8. వేగిన తరువాత అందులో టొమాటోలు వేసి వాటిని బాగా మగ్గనివ్వాలి
  9. అప్పుడు అందులో ఉప్పు ,కారం వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  10. అది చల్లారిన తరువాత రోట్లో వేసుకుని కచ్చా పచ్చా గ దంచుకోవాలి
  11. తరువాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి కచ్చా పచ్చా గ దంచుకున్న పచ్చడిలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర