స్పైసీ రాగి, జొన్న, సజ్జ మిక్సెడ్ రొట్టె | Spicy ragi,jonna,sajja miksed rotte Recipe in Telugu

ద్వారా Sukanya Sukku  |  5th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spicy ragi,jonna,sajja miksed rotte recipe in Telugu,స్పైసీ రాగి, జొన్న, సజ్జ  మిక్సెడ్ రొట్టె, Sukanya Sukku
స్పైసీ రాగి, జొన్న, సజ్జ మిక్సెడ్ రొట్టెby Sukanya Sukku
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

0

స్పైసీ రాగి, జొన్న, సజ్జ మిక్సెడ్ రొట్టె వంటకం

స్పైసీ రాగి, జొన్న, సజ్జ మిక్సెడ్ రొట్టె తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spicy ragi,jonna,sajja miksed rotte Recipe in Telugu )

  • రాగి పిండి. 1 కప్పు
  • సజ్జ పిండి. 1 కప్పు
  • జొన్న. పిండి. 1 కప్పు
  • బియ్యం పిండి. 1/4 కప్పు
  • పచ్చి కొబ్బరి తురుము 1/4 కప్పు
  • పచ్చిమిర్చి. 6
  • ఉల్లిపాయలు. 4 తరిగినవి
  • మెంతి కూర సన్నగా తరిగిన ది 1 కప్పు
  • వేరుశెనగ పప్పు. 1/4 కప్పు
  • కొత్తిమీర. 3 రెమ్మలు
  • జీలకర్ర. 1 స్పూన్
  • నూనె. 1/2 కప్పు
  • ఉప్పు. తగినంత

స్పైసీ రాగి, జొన్న, సజ్జ మిక్సెడ్ రొట్టె | How to make Spicy ragi,jonna,sajja miksed rotte Recipe in Telugu

  1. ముందుగా. ఒక బౌల్ తీసుకొని అందులో రాగి, సజ్జ, జొన్న, బియయప్పిండి అన్నీ రకాల పిండి లు. సరిపడినంత ఉప్పు వేసి కలపాలి
  2. అందులో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, మెంతి కూర, కొత్తిమీర,పచ్చి మిర్చి, కొబ్బరి, వేరుశెనగ పప్పు , జీలకర్ర అన్నింటినీ కలిపి మిక్సి లో వేసి గ్రైండ్ చేయాలి
  3. గ్రైండ్ చేసిన మిశ్రమన్ని పిండి లో వేసి, పావు కప్పు నూనె వేడి చేసి పిండి లో వేసి నీరు తగినంత గా పోసి బాగా కలపాలి నీరు కొద్ది, కొద్దిగా చూసుకొని పోసి బాగా కలపాలి
  4. పిండి ని చపాతీ పిండి మాదిరి గట్టి గా కాకుండా కొంచెం పేస్ట్ మాదిరిగా కలపాలి అప్పుడే రొట్టెలు మెత్తగా వస్తాయి
  5. బ్రౌన్ పేపర్ తీసుకొని చపాతీ పిట మీద వేసుకోవాలి. చేతికి నూనె రాసుకొని రొట్టె మాదిరిగా తట్టుకో వాలి రొట్టెలు మరీ పల్చగా తట్ట కూడదు గట్టిగా వస్తాయి
  6. మీడియం సైజ్ లో కొంచం మందం గా తట్టుకొని. చపాతీ పెనం మీద కాల్చుకోవాలి వేడి వేడి గా తింటే చాలా రుచిగా ఉంటాయి

నా చిట్కా:

ఇది వేడి, వేడి గా అప్పటికప్పుడు తినాలి అప్పుడే రుచి గా వుంటుంది ఇందులో నట్స్ కలిసి ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది

Reviews for Spicy ragi,jonna,sajja miksed rotte Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo