టమాటా రైస్ | TAMAATA rice Recipe in Telugu

ద్వారా Kavitha Perumareddy  |  6th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • TAMAATA rice recipe in Telugu,టమాటా రైస్, Kavitha Perumareddy
టమాటా రైస్by Kavitha Perumareddy
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

టమాటా రైస్ వంటకం

టమాటా రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make TAMAATA rice Recipe in Telugu )

  • అన్నం ఒక పెద్ద కప్ .
  • టమాటాలు 3 పెద్దవి
  • ఉల్లిపాయ 1 పెద్దది
  • పచ్చిమిర్చి 3
  • పసుపు కొద్దిగా
  • కారం చిన్న స్పున్
  • ఉప్పు తగినంత
  • నూనె 2 స్పూన్స్
  • పోపు గింజలు స్పూన్
  • కొత్తిమీర గుప్పెడు
  • కరేపాకు 2 రెమ్మలు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ స్పూన్
  • ధనియాలపొడి స్పున్

టమాటా రైస్ | How to make TAMAATA rice Recipe in Telugu

  1. ముందుగా టమాటాలు ,పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండిపెట్టి నూనె వేసి వేడిచేసి పోపుగింజెలు కరేపాకు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,ఉప్పు కొంచెం వేసి మగ్గనివ్వాలి .తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి టమాటా ముక్కలు ,పసుపు ,ధనియాలపొడి,కూడా వేసి కలిపి చిన్న మంట మీద 5 నిముసాలు మగ్గించాలి.
  3. టమాటాలు బాగా మగ్గిన తరువాత కారం ,కొద్దిగా కొత్తిమీర ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి.ఉప్పు ముందు కొంచమే వేశాము కాబట్టి రుచి చూసి ఇంకొంచెం వేసుకోవాలి.
  4. ఇప్పుడు మగ్గిన టమాటా మిశ్రమములో అన్నము వేసి బాగా కలిపి 5 నిముసాలు ఉంచాలి.అప్పుడు అన్నము కు టమాటా ఫ్లేవర్ బాగా పడుతుంది.
  5. ఇంకా వేరే గిన్నెలో తీసుకుని పైన కొత్తిమీర వేసి అలంకరించుకోవాలి .

నా చిట్కా:

టమాటా మగ్గించే టప్పుడు బాండీ పై మూతపెడితే త్వరగా మగ్గుతుంది.

Reviews for TAMAATA rice Recipe in Telugu (0)