హోమ్ / వంటకాలు / టమాటా రైస్

Photo of TAMAATA rice by Kavitha Perumareddy at BetterButter
62
4
0.0(0)
0

టమాటా రైస్

Sep-06-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా రైస్ రెసిపీ గురించి

ఈ అన్నం చాలా సులభంగా ఐపోతుంది .ఇంకా రుచిగా కూడా ఉంటుంది .లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం

కావలసినవి సర్వింగ: 3

  1. అన్నం ఒక పెద్ద కప్ .
  2. టమాటాలు 3 పెద్దవి
  3. ఉల్లిపాయ 1 పెద్దది
  4. పచ్చిమిర్చి 3
  5. పసుపు కొద్దిగా
  6. కారం చిన్న స్పున్
  7. ఉప్పు తగినంత
  8. నూనె 2 స్పూన్స్
  9. పోపు గింజలు స్పూన్
  10. కొత్తిమీర గుప్పెడు
  11. కరేపాకు 2 రెమ్మలు
  12. అల్లంవెల్లుల్లి పేస్ట్ స్పూన్
  13. ధనియాలపొడి స్పున్

సూచనలు

  1. ముందుగా టమాటాలు ,పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండిపెట్టి నూనె వేసి వేడిచేసి పోపుగింజెలు కరేపాకు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,ఉప్పు కొంచెం వేసి మగ్గనివ్వాలి .తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి టమాటా ముక్కలు ,పసుపు ,ధనియాలపొడి,కూడా వేసి కలిపి చిన్న మంట మీద 5 నిముసాలు మగ్గించాలి.
  3. టమాటాలు బాగా మగ్గిన తరువాత కారం ,కొద్దిగా కొత్తిమీర ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి.ఉప్పు ముందు కొంచమే వేశాము కాబట్టి రుచి చూసి ఇంకొంచెం వేసుకోవాలి.
  4. ఇప్పుడు మగ్గిన టమాటా మిశ్రమములో అన్నము వేసి బాగా కలిపి 5 నిముసాలు ఉంచాలి.అప్పుడు అన్నము కు టమాటా ఫ్లేవర్ బాగా పడుతుంది.
  5. ఇంకా వేరే గిన్నెలో తీసుకుని పైన కొత్తిమీర వేసి అలంకరించుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర