బిసిబేళెబాత్ | BISIBELE BHATH Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  6th Sep 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of BISIBELE BHATH by Tejaswi Yalamanchi at BetterButter
బిసిబేళెబాత్by Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

25

1

బిసిబేళెబాత్ వంటకం

బిసిబేళెబాత్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BISIBELE BHATH Recipe in Telugu )

 • బియ్యం : 1/2 కప్
 • కందిపప్పు : 1/2 కప్
 • క్యారెట్ : 2
 • క్యాప్సికమ్ : 1
 • ఉల్లిపాయ : 1
 • బఠానీ : 3 టేబుల్ స్పూన్లు
 • కరివేపాకు : 2 రెబ్బలు
 • ఆవాలు : 1/4 టీస్పూన్
 • జిడిపప్పు : 4 టేబుల్ స్పూన్లు
 • జిలకర్ర : 1/4 టీస్పూన్
 • నెయ్యి : 2 టేబుల్ స్పూన్లు
 • ఉప్పు : 1 టేబుల్ స్పూన్
 • చింతపండు గుజ్జు : 3 టేబుల్ స్పూన్లు(1:5 చింతపండు: నీరు)
 • పసుపు : 1/4 టీస్పూన్
 • MTR బిసిబేళెబాత్ మసాలా పొడి : 4 టేబుల్ స్పూన్లు
 • నీరు : తగినన్ని

బిసిబేళెబాత్ | How to make BISIBELE BHATH Recipe in Telugu

 1. ముందుగా క్యారెట్ ,క్యాప్సికమ్,బఠానీ తీసుకోండి.
 2. క్యారెట్ ,క్యాప్సికమ్లను ముక్కలుగా చేస్కోండి.
 3. ఒక ఉల్లిపాయని తీసుకోండి.ముక్కలుగా చేస్కోండి.
 4. మొత్తం కూరగాయలు ఒక కప్ సరిపోతాయి.
 5. బియ్యం, కందిపప్పుని తీసుకోండి(రెండు సమాన కొలత ఉండాలి( 1/2 : 1/2 ).
 6. బియ్యంలోతగినంత నీరు పోసి కుక్కర్ లో ఉడికించి పెట్టుకోవాలి.
 7. కండిపప్పులో తగినంత నీరు పోసి కుక్కర్ లో ఉడికించి పెట్టుకోవాలి.
 8. కందిపప్పుని పప్పుగుత్తితో మెత్తగా మెదపండి.
 9. అన్నంలో పప్పు వేయండి.
 10. అన్నం, పప్పులో అన్ని కూరగాయలను వేసి నీరు పోసి కుక్కర్ లో ఉడికించి పెట్టుకోవాలి.
 11. ఉడికినతరువత ఇలా ఉంటుంది.
 12. ఇప్పుడు నెయ్యి వేడి చేసి ఆవాలు, జిలకర్ర, జీడిపప్పులు వేయించి కరివేపాకు వేసి వేగానీవండి.
 13. ఇప్పుడు ఒక బౌల్ల్లో బిసిబేళెబాత్ మసాలా పొడిని వేసి,అందులో చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు, పసుపు, నీరు తగినంత వేసి కలపండి.
 14. తాలింపు వేసిన బాండీలో మసాలా మిశ్రమాన్ని వేసి ఒక రెండు నిమిషాలు ఉదకనివండి.
 15. ఉడికించిన మసాలా, చింతపండు గుజ్జు ని ఉడికించిన అన్నం,పప్పు,కూరగాయల మిశ్రమంలో బాగా కలిపి నీరు కూడా పోసి సిమ్ లో పెట్టి కాసేపు (పది నిమిషాలు) ఉడకనివ్వాలి.
 16. అంతే బిసిబేళెబాత్ తయారు. బిసిబేళెబాత్ ని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.

Reviews for BISIBELE BHATH Recipe in Telugu (1)

Jyothi Kadimisetty7 months ago

Very tasty
జవాబు వ్రాయండి

Cooked it ? Share your Photo