హోమ్ / వంటకాలు / మెగీ తో భేల్

Photo of Bhel with Meggi by Shobha.. Vrudhulla at BetterButter
81
3
0.0(0)
0

మెగీ తో భేల్

Sep-06-2018
Shobha.. Vrudhulla
45 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెగీ తో భేల్ రెసిపీ గురించి

భేల్ అందరికి నచ్చుతుంది.. పిల్లలకి అయితే ఇంకా ఇష్టంగా తింటారు కూడాను..అదే భేల్ మేగీ తో తయారు చేసమనుకోండి అప్పుడు పిల్లలు మోహములో సంతోషం యింకా ఎక్కువవుతుంది..ఎందుకంటే మేగీ కూడా పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి..మేగీ తో కలిపి భేల్ చేస్తే రెండు ఇష్టమైనవి కలిపితే వారి సంతోషం కూడా డబల్ అవుతుంది కదండీ.. అందుకే వేరేగా టేస్ట్ కోసం మేగీ భేల్ చేస్తున్నాను..

రెసిపీ ట్యాగ్

  • మ్యాగీ
  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కలయిక
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. మేగీ రెండు పేకెట్స్ (20 Rs పెక్ ఒకటి)
  2. మేగీ మాసాల రెండు ప్యాక్స్
  3. టమాట సాస్ అర కప్పు కావాలంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మన రుచిని బట్టి
  4. ఉల్లిపాయలు ఒక కప్పు
  5. టమాటాలు ఒక కప్పు
  6. దుంపలు మాములు సైజ్వి నాలుగు ఉడికించి తొక్క తీసి ఉంచుకోవలెను
  7. సనగపలుకులు అరకప్పు నూనెలో వేయించి ఉంచుకోవలెను
  8. జీడిపప్పు ఒక పది పలుకులు
  9. మిరపకాయ ఒకటి బాగా చెక్కుతరిగి ఉంచుకోవలెను
  10. చిల్లీ ఫ్లేక్స్ ఒక చెంచా
  11. కొత్తిమీర ఒక కప్పు
  12. చిన్న సేవ్ ఒక కప్పు
  13. నిమ్మకాయలు రెండు
  14. నూనె రెండు చంచాలు
  15. ఉప్పు తగినంత..

సూచనలు

  1. ముందుగా దుంపలు ఉడికించి చాలరక తొక్కతిసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవలెను.
  2. ఇప్పుడు మేగీ కి ఒక ముచ్చి కవర్లో వేసి బాగా ముక్కలు చేసి పెట్టుకోవలెను..
  3. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టి దానిలో మేగీ పొడిగానే వేయించి పెట్టుకోవాలి నూనె వేయరాదు.. బాగా పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవలెను
  4. ఇప్పుడు మరో ముకుడులో రెండు చెంచాల నూనె వేసి అది వేడెక్కేక అందులో ముందు జీఫిపప్పు వేయించి తీసుకో వలెను
  5. ఆ తరువాత సనగపలుకులు వేసి వేయించి తీసి పెట్టుకోవలెను..
  6. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ముందుగా మేగీ మసాలా గుండా వేయవలెను
  7. అందులోనే టమాట సాస్ కూడా వేసి రెండు అంటే మెగీ మసాలా గుండా మరియు టమాట సాస్ బాగా కలిసేలా కలపవలెను
  8. ఇప్పుడు ఆ కలిపిన మాసాలలో ఉల్లిపాయలు... టమాటాలు...తరిగిన దుంపలు....సనగపలుకులు...సగం జీడిపప్పు....మిరపకాయముక్కలు మరియు చిల్లీ ఫ్లెక్స్ వేసి అన్నీ బాగా కలిసే ల కింద మీద కలప వలెను
  9. ఇదంతా కలిసేక బాగా అందులో మిగిలినవి కొత్తిమీర.... ఉప్పు సగం చిన్న సేవ్ సన్నపాటిది వేసి మళ్ళీ మరోసారి బాగా కలిపి ప్లేటులో సర్వ్ చేసుకొనటమే
  10. ఇప్పుడు ప్లేటులో సర్వ్ చేసాక అందులో మీదనుంచి కొంచెం సేవ్..కొంచెం కొత్తిమీర..మిగిలిన జీడిపప్పు వేసి దాని చుట్టూ కలిసేలా నిమ్మకాయ రసం పిండుకోవలెను..
  11. నిమ్మరసం మనకి తగినట్టు వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ చేసి.అంతే..
  12. ఎంతో రుచికరమయిన మేగీ భేల్ తయారు...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర