పెరి పెరి మయోనిస్ స్టఫిన్గ్ రోల్స్. | Peri peri mayonise stuffing roles. Recipe in Telugu

ద్వారా Swapna Tirumamidi  |  6th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Peri peri mayonise stuffing roles. recipe in Telugu,పెరి పెరి మయోనిస్ స్టఫిన్గ్ రోల్స్., Swapna Tirumamidi
పెరి పెరి మయోనిస్ స్టఫిన్గ్ రోల్స్.by Swapna Tirumamidi
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

పెరి పెరి మయోనిస్ స్టఫిన్గ్ రోల్స్. వంటకం

పెరి పెరి మయోనిస్ స్టఫిన్గ్ రోల్స్. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Peri peri mayonise stuffing roles. Recipe in Telugu )

 • సాస్ కోసం ..కాశ్మీరీ ఎండుమిరపకాయలు 10
 • ఒరిగానో 1 చెంచా
 • కారం 1 చెంచా
 • నిమ్మరసం 1 చెంచా
 • వెనిగర్ 1 చెంచా
 • ఆలివ్ ఆయిల్ 2 చెంచాలు
 • ఉప్పు రుచికి చాలినంత
 • మయోనిస్ 2 పెద్ద చెంచాలు.
 • కూరకొఱకు...కాలిఫ్లవర్ ముక్కలు అరకప్పు
 • కాప్సికమ్స్ 3 రంగుల ముక్కలు 1 కప్
 • స్వీట్ కార్న్ అరకప్పు
 • పన్నీర్ 1 కప్
 • టమాటా తరుగు అరకప్పు
 • చిలగడ దుంప కోరు అరకప్పు(పంచదార కి బదులుగా నేను దీన్ని వాడాను)
 • మిరాయపొడి చిటికెడు
 • ఉప్పు చిటికెడు
 • ఒరిగానో 2 చిటికెళ్లు
 • గోధుమపిండి 2 కప్పులు
 • బటర్ లేదా నూనె 1 పెద్ద చెంచాడు.

పెరి పెరి మయోనిస్ స్టఫిన్గ్ రోల్స్. | How to make Peri peri mayonise stuffing roles. Recipe in Telugu

 1. ముందుగా సాస్ కోసం...మిరపకాయలు 15 నిమిషాలు వేడినీళ్లలో నానపెట్టి ఉంచాలి.
 2. మిక్సిజార్లో నానిన మిర్చి,ఒరిగానో,నిమ్మరసం,కారం,వెనిగర్,ఆలివ్ ఆయిల్,ఉప్పు చిటికెడు వేసి మెత్తగా పేస్ట్ లా చేసి ఒకబౌల్ లోకి తీసిపెట్టికోవాలి.ఈ పేస్ట్ ని ముందుగా తయారు చేసి నిలువ ఉంచుకుంటే పని సులువుగా ఉంటుంది.
 3. ఒక బౌల్లోకి 2 పెద్దచెంచాల మయోనిస్(గుడ్డు లేని)వేసి,ఒక చెంచా మిర్చి పేస్ట్ వేసి రెండింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి..
 4. గోధుమపిండి కొద్దిగా నూనె ఉప్పువేసి తగినన్ని నీళ్లు పోసి ముద్ద చేయాలి ...ఈ చపాతీ ముద్దని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
 5. ఇప్పుడు...ఒక మూకుడు పొయ్యిమీద పెట్టి మీడియం మంట లో ఉంచి ,కొద్దిగా నూనె లేదా బటర్ వేసి వేడిచెయ్యాలి.
 6. ఇప్పడు అందులో వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా తరిగి ఉంచుకున్న కాలిఫ్లవర్, క్యాప్సికమ్స్, టమాటా,స్వీట్ కార్న్,చిలగడ దుంప కోరు,పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా మగ్గేలా వేయించాలి.
 7. ఇప్పుడు చిటికెడు ఉప్పు,మిరియాలపొడి,చిటికెడు ఒరిగానో వేసి ఒకసారి కలిపి పొయికట్టేయాలి.
 8. ఈ వేయించిన కూరని ముందుగా రెడి చేసుకున్న పెరి పెరి సాస్,మయోనిస్ బౌల్ లో వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
 9. ఇక పెనం పొయ్యిమీద పెట్టి ,చపాతీపిండిని ముద్దలుగా చేసి పలుచగా చపాతీలా చేసి పెనంపై సన్న సెగమీద మెత్తగా కాల్చుకోవాలి...
 10. ఇప్పుడు కాల్చిన చపాతీని ప్లేట్ లోకి తీసుకొని కాస్త నెయ్యి రాసి, తయారు చేరుకున్న మిశ్రమాన్ని చపాతి మీద పెట్టి రోల్ చేసుకుని ,చివరలను కూడా లోపలికి మడత పెట్టకుంటే లోపలి కూర బయటికి రాకుండా ఉంటుంది...కావాలంటే మధ్యకి కట్ చేసుకోవచ్చు.
 11. అంతే కొత్తగా ,మంచి కారం గా,సరికొత్త రుచితో పెరి పెరి మయినిస్ రోల్స్ తినడానికి సిద్ధం..ఇవి 2 రోల్స్ టిఫిన్ బాక్స్ లో పెట్టి ,కొంచెం సలాడ్,కొన్ని పండ్ల ముక్కలతో,పొగిచిన శెనగల తో సద్ది ఇస్తే ఆ రోజుకు అది సంపూర్ణమైన ఆహారం అందించినట్లే .

నా చిట్కా:

ఇదే కూరని సమోసాలో కూడా స్టఫ్ చేసుకోవచ్చు.బ్రెడ్ సాండ్ విచ్ కి కూడా బావుంటుంది.

Reviews for Peri peri mayonise stuffing roles. Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo