గోంగూర పులిహోర | Sorrel leaves rice Recipe in Telugu

ద్వారా Ganiprameela Ganiprameela  |  8th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sorrel leaves rice recipe in Telugu,గోంగూర పులిహోర, Ganiprameela Ganiprameela
గోంగూర పులిహోరby Ganiprameela Ganiprameela
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

గోంగూర పులిహోర వంటకం

గోంగూర పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sorrel leaves rice Recipe in Telugu )

  • ఉడించిన అన్నం 2 కప్స్
  • గోంగూర 1 కప్
  • చింతపండు చిన్న నిమ్మకాయంత
  • నూనె 4 స్పూన్స్
  • పల్లీలు 1/4 కప్
  • జీలకర్ర 1 స్పూన్
  • ఆవాలు 1 స్పూన్
  • ఆవ పిండి 1/2 స్పూన్
  • చెనగపప్పు 3 స్పూన్స్
  • మినపప్పు 3 స్పూన్స్
  • పచ్చిమిర్చి 5
  • ఎండుమిర్చి 4
  • మిర్యాల పొడి 1/2 స్పూన్
  • మెంతి పొడి 1/2 స్పూన్
  • ఇంగువ 1/4 స్పూన్
  • పసుపు 1/2 స్పూన్
  • కర్యేపాకు 2 రెమ్మలు
  • థన్యాలపొడి 1/2 స్పూన్
  • జీడిపప్పు 10

గోంగూర పులిహోర | How to make Sorrel leaves rice Recipe in Telugu

  1. ముందుగా గోంగూర ఉప్పు నీటి లో బాగ కడిగి చింతపండు వేసి ఉడికించాలి చల్లారాక గ్రైండ్ చేసి పెట్టుకుని
  2. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి పోపుదినుసులు పల్లీలు వేసి వేగుతుండగా పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు ఎండుమిర్చి ఆవపిండి మెంతిపొడి ధన్యాలపొడి కర్వేపాకు ఉప్పు పసుపు ఇంగువ వేసి పోపు చేసి అన్నంలో వేసి గోంగూర పేస్ట్ కూడ వేసి కలిపి అదిమి పెట్టాలి
  3. చివరిగా జీడిపప్పు నెయ్యి లో వేపి అలంకరించాలి అంతే గోంగూర పులిహోర రెడీ

నా చిట్కా:

గోంగూర శ్వాస సంబంధమైన సమస్యలకు మంచి ఔషదం

Reviews for Sorrel leaves rice Recipe in Telugu (0)